ఆ హీరో ఛాన్స్ ఇచ్చినా కాదనేదాన్ని.. లైంగిక వేధింపుల బాధ తట్టుకోలేం.. డిప్రెషన్‌కి లోనయ్యా: తాప్సి
బాలీవుడ్‌లో విడుదలై భారీ సక్సెస్ సాధించిన 'పింక్' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'నెర్కొండ పార్వై' అనే టైటిల్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. 'పింక్' సినిమాలో తాప్సి కీలక పాత్రలో నటించగా.. 'నెర్కొండ పార్వై' లో తాప్సి పాత్రను శ్రద్ధా శ్రీనాథ్ పోషిస్తోంది. అజిత్ హీరోగా నటిస్తున్నాడు. సమాజంలో మహిళా ప్రాధాన్యతను తెలిపే కథాంశంతో రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాప్సి స్పందించింది.

డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా
పింక్‌లో నటించిన తనకు నెర్కొండ పార్వైలో అవకాశం వచ్చినా తాను నటించే దానిని కాదని తాప్సి పేర్కొంది. ఆ పాత్ర చాలా భావోద్వేగంతో కూడినదని అందులో నటించడం చాలా చాలా కష్టమని తాప్సి చెప్పింది. 'పింక్' సినిమాలో నటిస్తున్నపుడే తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని చెబుతూ సదరు పాత్ర గురించి వివరించింది తాప్సి.

లైంగిక వేధింపుల బాధ భరించలేం
పింక్ పాత్ర సవాలుతో కూడుకున్నదని తాప్సి అంటోంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఓ అమ్మాయి పడే బాధను ఆ పాత్రలో చూడొచ్చని, ఆ బాధ భరించరానిదని చెప్పింది. పింక్‌లో ఈ పాత్ర చేసినప్పుడే తనకు చాలా కష్టం అనిపించిందని మళ్లీ 'నెర్కొండ పార్వై' లో అదే పాత్ర చేయమని అవకాశం ఇచ్చినా అస్సలు ఒప్పుకునేదాన్ని కాదని ఈ సందర్బంగా తాప్సి చెప్పుకొచ్చింది.

అజిత్‌తో ఓకే కానీ
హీరో అజిత్ తో నటించడానికి తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని తాప్సి చెప్పింది. ఈ సినిమాలో అజిత్ తో నటించాను గానీ వేరే సినిమాల్లో అజిత్ తో నటించే అవకాశం వస్తే కాదననని తాప్సి తెలిపింది. మరోవైపు ఇటీవలే విడుదలైన నెర్కొండ పార్వే టీజర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.

నెర్కొండ పార్వై మూవీ
వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నెర్కొండ పార్వై మూవీకి శ్రీ దేవి భర్త బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ దేవి కోరిక మేరకే ఈ సినిమాను తాను నిర్మిస్తున్నట్లుగా బోనీ కపూర్ ప్రకటించారు. అజిత్ హీరోగా నటిస్తుండగా, శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆగస్ట్ 10 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











