మగ్గాళ్ళందరూ అలాంటి వారే.. పెళ్ళికి పనికొచ్చే మగాడు అతనొక్కడే.. తాప్సి సంచలన కామెంట్స్

సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను తెలుగులో పలు సినిమాలు చేసినప్పటికీ ఆశించిన మేర ఫలితం రాబట్టలేక పోయింది. దీంతో వెంటనే బాలీవుడ్ గడప తొక్కిన ఈ భామ అక్కడ మాత్రం వరుస సినిమాలతో హంగామా చేస్తోంది. తాప్సి అభినయానికి బాలీవుడ్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు ఫిదా అవుతున్నారు.

పింక్ సినిమాతో మంచి స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతోంది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ భేష్ అనిపించుకుంటోంది. సూర్మా, ముల్క్, మన్మర్జియా, బద్లా వంటి సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించున్న తాప్సి తాజాగా జరిగిన ఓ షోలో మగవారిపై సంచలన కామెంట్స్ చేసింది.

Taapsee Pannu sensetional comments on mens

బీఎఫ్ఎఫ్స్ విత్ వోగ్ - సీజన్ 3 షోకు హాజరైంది తాప్సి. ఈ షోకి తాప్సితో పాటు తనతో కలిసి మన్మర్జియా సినిమాలో నటించిన విక్కీ కౌశల్ కూడా హాజరయ్యారు. ఈ షోలో విక్కీని పరిచయం చేసిన తాప్సి మగాళ్ళపై ఓ సంచలన కామెంట్ విసరడంతో అంతా అవాక్కయ్యారు. అందరు మగాళ్ళు (డ్యాష్ డ్యాష్) కానీ విక్కీ ఈజ్ ది బెస్ట్ అని తాప్సి చెప్పడంతో అంతా షాకయ్యారు. ఇక ఈ షోలో ఎంతో సరదా సరదా ముచ్చటించిన తాప్సి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

మన్మర్జియా సినిమా కంటే ముందే విక్కీతో తనకు రిలేషన్ ఉందని పేర్కొంది. ఆ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే విక్కీతో తన వాట్సాప్ స్నేహం ఎలా సాగిందో వివరించింది తాప్సి పన్ను. ఇక ఈ షోలో భాగంగా వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, అభిషేక్ బచ్చన్.. ఈ ముగ్గురిలో ఎవరితో హుక్ అప్.. మ్యారీ.. కిల్? అనే ప్రశ్నకు బదులిస్తూ వరుణ్ ధావన్ తో హుక్ అప్.. అభిషేక్ ను కిల్ చేస్తా.. విక్కీ ని మ్యారేజ్ చేసుకుంటా అని ఆశ్చర్య పరిచే సమాధానం చెప్పింది. పెళ్ళికి పనికొచ్చే మెటీరియల్ అంటూ విక్కీని తాప్సి కామెంట్ చేయడం సెన్సేషన్ అవుతోంది.

ఇటీవలే గేమ్ ఓవర్ అనే హారర్ థ్రిల్లర్ సినిమాకు సంతకం చేసింది తాప్సి. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో వై నాట్ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కనుంది. మరోవైపు హిందీలో తడ్కా, మిషన్ మంగళ్, సాంద్ కీ ఆంఖ్ సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తోంది ఈ సొట్ట బుగ్గల సుందరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X