Ustad Zakir Hussain : ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూత.. శోకసంద్రంలో సంగీత ప్రపంచం

దశాబ్ధాలుగా భారతీయ సంగీత ప్రపంచాన్ని అలరిస్తున్న తబలా విధ్వంసుడు లెజెండరీ ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. అనారోగ్యంతో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం జాకీర్ ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. హై బ్లడ్ ప్రెజర్, గుండె సంబంధిత అనారోగ్యంతో జాకీర్ బాధపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

1951 మార్చి 9న ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్ అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి. తల్లిదండ్రులు అల్లా రఖా , బావి బేగం. నగరంలోని సెయింట్ మైఖేల్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను , ప్రఖ్యాత సెయింట్ జేవియర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ను ఆయన పూర్తి చేశారు. తండ్రి అల్లారఖా బాటలోనే సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన ఆయన నాన్నగారి లాగానే తబలాతో మేజిక్ చేశారు. తబాలతో పాటు హిందుస్థానీ సాంప్రదాయ సంగీతం, జాజ్ ఫ్యూజన్‌‌లోనూ తన ముద్ర వేశారు.

Tabla maestro Ustad Zakir Hussain passes away at 73

1973లో కెరీర్ ప్రారంభించిన జాకీర్ హుస్సేన్ దాదాపు 50 ఏళ్లకు పైగా ప్రస్థానంలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వేలాది ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు ఎందరో సంగీత దిగ్గజాలతో కలిసి పనిచేశారు. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలకు గాను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు జాకీర్‌ను వరించాయి. సంగీత్ నాటక అకాడమీ అవార్డుతో పాటు ప్రతిష్టాత్మక కాళిదాస్ సమ్మాన్ అందుకున్నారు.

ఇక భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్‌ పురస్కారాలతో జాకీర్‌ను గౌరవించింది. పలుమార్లు ప్రపంచ ప్రఖ్యాత గ్రామీ అవార్డులను సాధించి భారతదేశ కీర్తి పతకాన్ని రెపరెపలాడించారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ 66వ గ్రామీ అవార్డుల్లో మూడు తన ఖాతాలో వేసుకున్నారు జాకీర్ హుస్సేన్. ఆయనకు భార్య అంటోనియా , కుమార్తెలు అనిషా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషిలు ఉన్నారు. అంటోనియా కథక్ డ్యాన్సర్ కాగా.. అంతేకాదు స్వయంగా భర్తకు మేనేజర్‌గానూ వ్యవహరిస్తున్నారు.

జాకీర్ హుస్సేన్‌లో విద్వాంసుడే కాదు.. మంచి నటుడు కూడా ఉన్నాడు. హిందీ, తమిళ్, ఇంగ్లీష్ సినిమాలలో కనిపించి అలరించారు. ఈ ఏడాది కూడా మంకీ మాన్ అంటూ పలకరించారు. జాకీర్ హుస్సేన్ మరణం పట్ల పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Read more about: ustad zakir hussain movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X