అల వైకుంఠపురములో అప్‌డేట్.. రేపే ఆమె ఫస్ట్ లుక్.. అదిరిపోనుందని టాక్
నా పేరు సూర్య చిత్రం డిజాస్టర్ కావడంతో చాలారోజులు గ్యాప్ తీసుకున్నాడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. అభిమానులకు ఎలాగైనాహిట్ ఇవ్వాలన్న కసితో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పటికే రెండు సూపర్ డూపర్ హిట్లు (జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి) రాగా హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యారు. అల వైకుంఠపురములో అంటూ విడుదల చేసిన చిన్న టీజరే ఎన్నో అంచనాలు పెంచేసింది.
ఇక ఈ మూవీ నుంచి పాటలను విడుదల చేస్తూ సోషల్ మీడియాలో సంచలన సృష్టిస్తోంది చిత్రబృందం. సామజవరగమన అంటూ రెండు తెలుగు రాష్ట్రాలను తన మాయలో పడేసుకున్నాడు సంగీత దర్శకుడు తమన్. ఇక ఈ పాటను మరిచిపోక ముందే రాములో రాముల అంటూ తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపేశాడు. ఈ రెండు పాటలు సోషల్ మీడియాలో రికార్డులు బద్దలకొడుతున్నాయి. ఇప్పటికీ ఇవి దూసుకుపోతూనే ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. ఈ మూవీ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రేపు (నవంబర్ 4) ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టబు పాత్ర ఈ సినిమాకే హైలెట్‌గా నిలవనుందని టాక్. పూజా హెగ్డే, నివేధా పేతురాజ్‌లు నటిస్తోన్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











