అల.. వైకుంఠపురములో టబు ఎలా ఉందో చూడండి.. నెట్టింట సీనియర్ భామ హల్చల్
టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చే సీనియర్ భామలు పెరిగిపోతున్నారు. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్లు.. తిరిగి తెలుగు చిత్రసీమలోకి వస్తున్నారు. ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి తన లుక్ ద్వారా మిస్మరైస్ చేయగా, తాజాగా 'అల.. వైకుంఠపురములో' సినిమాలో మరో సీనియర్ భామ టబు స్పెషల్ కిక్ ఇచ్చింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో'. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాతోనే తిరిగి తెలుగు తెరపై కనిపించబోతోంది టబు. ఇప్పటికే ఆమెకు సంబంధించిన కొన్ని షూట్స్ చిత్రీకరణ కూడా జరిగింది.

అయితే తాజాగా ఈ రోజు (నవంబర్ 4) టబు పుట్టినరోజు సందర్బంగా 'అల.. వైకుంఠపురములో' సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందమైన కళ్లు, చక్కని చిరునవ్వుతో ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో చాలా గార్జియస్‌గా కనిపిస్తోంది టబు. దీంతో ఈ పోస్టర్ నెట్టింట హల్చల్ చేస్తోంది. టబు లుక్ చూసి మురిసిపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. 'అల వైకుంఠపురంలో' సినిమాకు టబు పర్‌ఫార్‌మెన్స్ మేజర్ అసెట్ కానుందని తెలుస్తోంది. శ్రీమంతురాలైన 'అలకనందాదేవి' పాత్రలో టబు కనిపించనుంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. చిత్రంలో సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ కానుంది. భారీ అంచనాల నడుమ జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











