Just In
- 50 min ago
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.. ఏకంగా రెండు ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్.!
- 1 hr ago
'సరిలేరు నీకెవ్వరు' మండే సర్ప్రైజ్.. అదరగొట్టేస్తున్న మూడో పాట
- 2 hrs ago
'శివ 143' సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్.. చిన్న సినిమాకి పెద్ద ప్రోత్సాహం
- 2 hrs ago
మహేష్, బన్నీ అభిమానుల రచ్చ రచ్చ.. మొగుడు, మగాడు అంటూ ఒకరిపై ఒకరు!
Don't Miss!
- Sports
'ధోని జట్టులోకి తిరిగి రావాలనుకుంటే మళ్లీ ఆడటం ప్రారంభించాలి'
- News
ఇక ఆ 52వేల మంది ప్రభుత్వ ఉద్యోగులే: ఆర్టీసీ విలీనం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
- Automobiles
కొత్తగా కొనుగోలు చేసిన బస్సులను తిరిగి ఇవ్వనున్న ఉత్తరాఖండ్ రవాణా శాఖ
- Technology
కొత్తగా 'క్యాప్షన్ వార్నింగ్' ఫీచర్ ను ప్రారంభించిన ఇన్స్టాగ్రామ్
- Finance
అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్స్
- Lifestyle
వైరల్ : కదిలే గుర్రాన్ని గెలికితే.. ఏమవుతుందో ఈ వీడియోలో మీరే చూడండి...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
'అల.. వైకుంఠపురములో' నుంచి టబు బ్రేక్.. ఇదీ మ్యాటర్
ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్లు.. తిరిగి తెలుగు చిత్రసీమలోకి వస్తుండటం సినీ వర్గాల్లో జోష్ నింపుతోంది. ఇప్పటికే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో విజయశాంతి, 'అల.. వైకుంఠపురములో' సినిమాతో టబు రీ ఎంట్రీ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ వారి వారి సినిమా షూటింగుల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
అయితే తాజాగా అందిన సమాచారం మేరకు 'అల.. వైకుంఠపురములో' సినిమా నుంచి టబు బ్రేక్ తీసుకుందట. ఇప్పటిదాకా ఆమెపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. అయితే సామజవరగమన సాంగ్ షూట్ నిమిత్తం 'అల.. వైకుంఠపురములో' యూనిట్ అంతా ఫ్రాన్స్ వెళ్లిన కారణంగా టబుకి కాస్త బ్రేక్ లభించిందని తెలుస్తోంది. దీంతో ఈ గ్యాప్‌లో టబు భోల్ బులియ్య 2 చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారని సమాచారం. చిత్ర యూనిట్ ఫ్రాన్స్ నుంచి తిరిగి రాగానే టబుపై మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరపనుందట చిత్ర యూనిట్.

ఇప్పటికే 'అల.. వైకుంఠపురములో' సినిమా నుంచి విడుదల చేసిన టబు లుక్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. దీంతో వెండితెరపై బన్నీతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోవడం చూడాలని ఆతృతగా ఉన్నారు బన్నీ అభిమానులు. చిత్రంలో టబు పాత్రకు బాగా వెయిటేజ్ కల్పించారట త్రివిక్రమ్.
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ కానుంది. భారీ అంచనాల నడుమ జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.