Takita Tadimi Tandana First look భావోద్వేగాలతో తకటి తదిమి తందాన.. ఫస్ట్ లుక్ రిలీజ్

కంటెంట్‌ ప్రధానంగా వచ్చే చిత్రాలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ దక్కుతున్నది. తక్కువ బడ్జెట్ చిత్రమా? కొత్త నటీనటులా అనే విషయాన్ని పట్టించుకోకుండా మంచి కంటెంట్‌తో ఫీల్‌గుడ్‌గా నిలిచే చిత్రాలు మంచి విజయాలను అందుకొంటున్నాయి. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నాయి.

Takita Tadimi Tandana

ఈ క్రమంలో ఫీల్‌గుడ్ కంటెంట్, కమర్షియల్ హంగులతో రూపొందుతున్న చిత్రం తకిట తదిమి తందాన.. గత కొద్దినెలలుగా నిర్విరామంగా షూటింగ్ జరుపుకొంటూ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొన్నది. ఈ సందర్బంగా సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మర్డర్ మూవీలో నటించిన ఘన ఆదిత్య, ప్రియ జంటగా యువ దర్శకుడు రాజ్ లోహిత్ దర్శకత్వంలో ఎల్లో మాంగో ఎంటర్‌టైన్‌మెంట్, వ్యాస స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సందర్భంగా..

చిత్ర నిర్మాత చందన్ కుమార్ మాట్లాడుతూ.. తకటి తదిమి తందాన చిత్రం షూటింగ్ పూర్తయింది. విభిన్నమైన కథతో రూపొందిన చిత్రమిది. ప్రతీ ఒక్కరిని కదిలించే కథలో మంచి భావోద్వేగాలు ఉన్నాయి.

సినిమాటోగ్రాఫర్‌గా అర్జున్, రచయితగా దిలీప్ కుమార్, ఎడిటర్‌గా జానీ బాషా మ్యూజిక్ డైరెక్టర్‌గా అభిషేక్, ఫోటోగ్రాఫర్‌గా బన్నీ సంగరాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సాయి కిరణ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. త్వరలో సినీ ప్రముఖుల సమక్షంలో టీజర్ రిలీజ్ చేయనున్నాం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X