Takkar Trailer Reviewఇడ్లీల కోసం కిడ్నీలు అమ్మాల్సిందే..టక్కర్‌లో కేక పెట్టించిన సిద్దార్థ్, దివ్యాంశ రొమాన్స్

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన సిద్దార్థ్ గత కొద్దికాలంగా తెలుగు సినిమాల్లో తరచుగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న యాక్షన్ రొమాంటిక్ చిత్రం టక్కర్ విడుదలకు సిద్దమైంది. కార్తీక్ జీ క్రిష్ స్వయంగా రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ జూన్ 9వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు బాగా డబ్బు సంపాదించాలనే కోరికతో ఎంతకైనా తెగించేందుకు సిద్దంగా ఉన్నాడనేది టక్కర్ ట్రైలర్‌లో కనిపించింది. డబ్బు కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్న యువకుడు సంపన్న యువతికి చేరువ కావడం.. ఆ తర్వాత అతడి జీవితంలో ఊహించని పరిస్థితులు చోటు చేసుకోవడం, అనేక ట్విస్టులు, టర్న్స్‌తో కథ సాగుంతుందనే అభిప్రాయాన్ని ట్రైలర్ స్పష్టం చేసింది.

డబ్బు సంపాదించాలి.. కోటీశ్వరుడు కావాలనుకొనే కొడుకును చూసి తల్లి భయపడిపోవడం ఓ ఫీల్‌ను కలిగించింది. డబ్బు సంపాదిస్తానని చెప్పు. కానీ డబ్బు ఉన్న వాడిని అవుతానని చెప్పకురా అంటూ తల్లి దీనంగా వేడుకొనే సీన్ బాగుంది. సంపన్న కుటుంబానికి చెందిన యువతితో నీకు ఇడ్లీలు తినిపించాలంటే.. నేను కిడ్నీలు అమ్ముకోవాల్సిందే అంటూ సిద్దార్థ్ చేత చెప్పించిన డైలాగ్స్ బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాలు, యోగి బాబు కామెడీ స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందనే ఫీలింగ్ ట్రైలర్ కలిగించింది.

Takkar Trailer Review: Siddharth and Divyansha romance goes crazy

సిద్దార్థ్, దివ్యాంశ కౌశిక్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఫ్రెష్‌గా కనిపించాయి. సిద్దార్థ్‌ను దివ్యాంశ ఎగిరి వాటేసుకోవడం, లిప్‌లాక్ సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. రిచ్ గర్ల్‌గా దివ్యాంశ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కేక పెట్టించింది. సిద్దార్థ్, దివ్యాంశ మధ్య కెమిస్ట్రీని తెర మీద దర్శకుడు బాగా పడించారనేది టక్కర్ ట్రైలర్ స్పష్టం చేసింది.

Takkar Trailer Review: Siddharth and Divyansha romance goes crazy

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన టక్కర్ సినిమాను నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో దివ్యాంశ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించి నివాస్ కే ప్రసన్న రాసిన పాటలు మంచి వైరల్ అయ్యాయి. ఇక తాజాగా రిలీజైన టక్కర్ ట్రైలర్ 10 లక్షల వ్యూస్ సొంతం చేసుకొన్నది.

Takkar Trailer Review: Siddharth and Divyansha romance goes crazy

నటీనటులు: సిద్దార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగిబాబు, మునిష్‌కాంత్, ఆర్జే విగ్నేశ్ కాంత్ తదితరులు
రచన, దర్శకత్వంశ కార్తీక్ జీ క్రిష్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మయాంక్ అగర్వాల్
సినిమాటోగ్రాఫర్: వంచినాథన్ మురుగేశన్
ఎడిటర్: జీఏ గౌతమ్
ఆర్ట్: ఉదయ్ కుమార్ కే
స్టంట్స్: దినేష్ కాశీ
పీఆర్వో: లక్ష్మీ వేణుగోపాల్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X