మంత్రి తలసానితో చిరు, నాగ్ భేటీ.. వాటిై చర్చల కోసమే!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సఖ్యతగా ఉంటూ.. చిత్ర పరిశ్రమ అభివృద్దికి కావాల్సిన వాటిన సముపార్జించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికలపై చెప్పుకొచ్చాడు చిరంజీవి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు.. చిత్ర పరిశ్రమకు ఏది కావాలన్నా చేయడానికి సిద్దంగా ఉన్నాయని గతంలో చిరు ఉద్థాటించిన సంగతి తెలిసిందే.

 మా డైరీ ఆవిష్కరణలో..

మా డైరీ ఆవిష్కరణలో..

మా డైరీ ఆవిష్కరణలో చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం అటు ఆంధ్ర.. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రులు చాలా అనుకూలంగా ఉన్నారని వాళ్లను మనమే సరిగా వాడుకోలేకపోతున్నామంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఈ మధ్యే కేటీఆర్‌ను కలిసి సినిమా ఇండస్ట్రీ కోసం స్థలం అడిగితే ఎక్కడ కావాలో చెప్పండి అంటూ తనతో చాలా పాజిటివ్ రియాక్షన్స్ ఇచ్చాడని గుర్తు చేసాడు మెగాస్టార్.

ఎలాంటి సాయమైనా..

ఎలాంటి సాయమైనా..

ఇక కేసీఆర్ కూడా చాలా వరకు తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పాటు పడుతున్నాడని.. ఇప్పటి వరకు తెలంగాణ పాలనపై దృష్టి పెట్టడం వల్ల ఇండస్ట్రీ కోసం పెద్దగా ఏం చేయలేదని కానీ ఇప్పుడు చేస్తామని చెప్పినట్లు తెలిపాడు చిరంజీవి. మొన్న ఓ ఈవెంట్‌కు వెళ్లినపుడు ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం ఎలాంటి సాయమైనా చేయడానికి సిద్ధంగానే ఉందని తనతో పాటు, నాగార్జునకు కేసీఆర్ చెప్పారని గుర్తు చేసాడు.

ఏం చేయాలో చెప్పన్నా..

ఏం చేయాలో చెప్పన్నా..

సైరా చిత్ర సమయంలో ఏపీ సీఎం జగన్‌ను కలిసినప్పుడు కూడా చాలా సానుకూలంగా స్పందించినట్టు తెలిపాడు. సినీ పరిశ్రమ అభివృద్దికి కట్టుబడి ఉన్నామని, మీరు ఏది చేయమంటే అది చేస్తామని, ఏది కావాలో చెప్పన్నా అంటూ జగన్ అన్నాడని చిరు చెప్పుకొచ్చాడు. ఇలా ఇరు రాష్ట్రాల సీఎంలతో సఖ్యత నెరుపుతూ.. సినీ పరిశ్రమ అభివృద్దికి పాటు పడుతున్నాడు చిరు.

తాజాగా మంత్రితో భేటీ..

తాజాగా మంత్రితో భేటీ..

కేసీఆర్ ఆదేశాల మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్... చిరంజీవి, నాగార్జునను కలిశారు. చిరు నివాసంలోనే ఈ బేటీ జరిగింది. సినిమారంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చిరంజీవి, నాగార్జునలతో మంత్రి తలసాని చర్చించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X