టాలీవుడ్‌కు ఓ అసెట్.. ఇలాంటి సినిమా జర్నలిస్టుల ఎక్కడా దొరకరు.. మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రశంస
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను మెగాస్టార్ చిరంజీవి ప్రధానం చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రతి ఒక్కరికీ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఎతికా ఇన్యూరెన్స్ సి.ఇ.ఓ. రాజేంద్ర, టి.ఎఫ్.జె. అధ్యక్షుడు వి లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ వై జె రాంబాబు, కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..

సమాజంలో ఫోర్త్ పిల్లర్ జర్నలిస్టులే. మారుతున్న సమయంలో ప్రతీ అంశాన్ని రాజకీయం చేసే అంశాలను చూస్తున్నాం. కానీ తెలుగు సినీ పరిశ్రమకు జర్నలిస్టులు ఒక ఆస్తి లాంటి వారు. ఏ మేరకు, ఎంత వరకు అవసరమో అంతే మొత్తంలో సినిమా ప్రమోషన్‌లో భాగమయ్యారే తప్ప.. సినిమాను రాజకీయం చేయనటువంటి జర్నలిస్టులు ఎక్కడైనా దొరుకుతారా అంటే తెలుగు సినిమా పరిశ్రమలోనే అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల అంతా అతలాకుతలం అయితే.. చిరంజీవి గారు ముందుకు వచ్చి.. సినీ కార్మికులకు, జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు చేశారు. సినిమా పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ.. సేవాగుణంతో చిరంజీవి ముందుకెళ్తున్నారు. బ్లడ్ బ్యాంక్ పెట్టి ప్రజలను, పేషెంట్లను ఆదుకోవడం అభినందనీయం అని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
సినిమా పరిశ్రమ 75 ఏళ్లుగా కొనసాగుతున్నది. సినిమాకు పరిశ్రమకు, సినిమాలకు ప్రమోషన్ జర్నలిస్టుల వల్లే భారీగా జరుగుతున్నది. సినిమా పరిశ్రమ అభివృద్దిలో భాగమైన జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టుల తరపున చిరంజీవికి ఒకే ఒక సూచన చేయాలనుకొంటున్నాను. నిర్మాత, దర్శకులు తాము నిర్మించే సినిమా సమయంలో జర్నలిస్ట్ సంఘానికి లక్ష రూపాయల ఫండ్‌ను కేటాయిస్తే బాగుంటుందనే నా అభిప్రాయం అని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
కరోనా సమయంలో చిరంజీవిగారు చొరవ తీసుకుని జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా వున్నారు. అలాగే నేను కూడా వందలాదిమందికి గ్రాసరీస్‌ను అందజేశాను. అలాగే ప్రతి సినిమాకు లక్షరూపాయల చొప్పున టి.ఎఫ్.జె. అసోసియేషన్‌కు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నాను. నా వంతు సాయంగా నేను ఐదులక్షలు రేపు అందజేస్తాను. ఇప్పటికే దిల్‌రాజు, అనిల్ రావిపూడి, నిర్మాత రాధాకృష్ణ వంటివారు పలురకాలుగా అసోసియేషన్‌కు అండగా ఉన్నారు.
అదేవిధంగా ప్రభుత్వపరంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కె.సి.ఆర్. ప్రభుత్వం చేపడుతుంది. సినిమారంగానికి సింగిల్ విండో, 5వ ఆట, రేట్ల విషయంలో వెసులుబాటు వంటి చేసింది. ఇక ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ కూడా ప్రవేశపెట్టింది. సినిమా జర్నలిస్టులకు కూడా అందులో వుండేలా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా అక్రిడేషన్ గురించి కూడా ఐ.ఎన్.పి.ఆర్ .డిపార్ట‌్మెంట్‌తో మాట్లాడి వచ్చేలా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
తెలుగు సినిమా పరిశ్రమ నుంచి బాహుబలి, RRR సినిమాలు జాతీయస్థాయిలో సత్తా చాటాయి. అలాగే కేజీఎఫ్2 చిత్రం మినహాయిస్తే, చిరంజీవి ఆచార్య సినిమాలు అదే స్థాయిలో సత్తా చాటనున్నది. .


Click it and Unblock the Notifications











