RRRలో ఆ సీన్స్ కోసం టాలెంటేడ్ హీరోయిన్.. గోల్డెన్ ఛాన్స్
ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాకు సంబంధించిన రూమర్స్ గత కొన్ని రోజులుగా అభిమానులను చాలా కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నాయి. ఓ వైపు కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన వివాధాలు వైరల్ అవుతున్న సమయంలో సినిమా రిలీజ్ డేట్ మరింత ఆలస్యమని అలాగే బడ్జెట్ కూడా పెరిగిందని అలాగే కొన్ని పాత్రల కోసం టాలెంటేడ్ నటీమణులను సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ కి జోడిగా అలియా భట్ జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తారక్ జోడిగా ఒక మరదలి పాత్ర కోసం టాలెంటేడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎమోషనల్ సీన్స్ తో పాటు కొన్ని విరత్వపు సన్నివేశాల్లో నటించడానికి ఆమె సరిగ్గా సరిపోతుందని దర్శకుడు కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఎంతో కాలంగా పెద్ద సినిమాల్లో అవకాశం అందుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఐశ్వర్యకు ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పవచ్చు.

అయితే ఈ విషయంలో అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక ఇటీవల RRR లోని ఎన్టీఆర్ భీమ్ టీజర్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ అభిమానులకు మంచి కిక్కిచ్చిందనే చెప్పాలి. కానీ భీమ్ టోపి పెట్టుకోవడంపై గిరిజన సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అలాగే పొలిటికల్ గా కూడా ఈ వివాదం మరింత సీరియస్ గా మారుతోంది. రాజకీయ నేతలు హెచ్చరిస్తున్నప్పటికి ఇంకా చిత్ర యూనిట్ ఏ విధంగాను స్పందించకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారుతోంది.


Click it and Unblock the Notifications











