మెగా హీరో సినిమా నుంచి తప్పుకున్న టాలెంటెడ్ హీరోయిన్.. ఒత్తిడి తట్టుకోలేక..?
లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాలా షూటింగ్స్ పెండింగ్ లో పడ్డాయి. అయితే ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రకారం వీలైనంత త్వరగా చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకోవాలని కొంతమంది తారలు తీరిక లేకుండా కష్టపడుతున్నారు. కొందరైతే ఫెస్టివల్స్, వీకెండ్స్ అని తేడా లేకుండా కష్టపడుతున్నారు. అందులో నివేదా పేతురాజ్ ఒకరు. ఈ బ్యూటీ నటనతోనే క్రేజ్ ఎక్కువగా అందుకుంటోంది. వీలైనంత వరకు సినిమాలో తన పాత్ర హైలెట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది.
అసలు మ్యాటర్ లోకి వస్తే నివేదా ఇటీవల ఒక మెగా హీరో సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మొదట నటిస్తానని చెప్పిన ఈ బ్యూటీ మళ్ళీ షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలవుతుందనగా డ్రాప్ అయ్యిందట. అందుకు కారణం తీవ్ర ఒత్తిడి అనే తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ప్రస్తుతం పూర్తి చేయాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. ఆ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదట. డేట్స్ కూడా చాలా వరకు క్లాష్ అవుతుంటే అడ్జస్ట్ చేయలేక సతమతమవుతొందట.

ఇక షూటింగ్ మొదలుకాని సినిమాలను పక్కన పెట్టేసి ప్రస్తుతం చేతిలో ఉన్నవి పూర్తయిన తరువాతనే కొత్త వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ్, దేవకట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి కూడా ఈ బ్యూటీ తప్పుకుందట. దీంతో ఆమె స్థానంలో ఐశ్వర్య రాజేష్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











