Prabbu Deva: 50 ఏళ్ళ వయసులో నాలుగోసారి తండ్రి అయిన ప్రభుదేవా.. బాధలో ఉన్న టైమ్ లో గుడ్ న్యూస్!

కొరియోగ్రాఫర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత నటుడిగా మారి ఇప్పుడు దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న ఆల్ రౌండర్ ప్రభుదేవా. సుదీర్ఘ కెరియర్ లో మల్టీ టాలెంటెడ్ గా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. ప్రస్తుతం హిందీలో రౌడీ రాథోడ్ రీమేక్ కోసం ప్రభుదేవా సిద్ధం అవుతున్నారు. అయితే ఈ క్రమంలో ప్రభుదేవా ఒక గుడ్ న్యూస్ తో హాట్ టాపిక్ గా మారాడు. ఇక 50 ఏళ్ళ వయసులో నాలుగవసారి అతను తండ్రి అయ్యాడు. అందుకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట హీరోగా చేసి:మొదట శంకర్ దర్శకత్వంలో ప్రేమికుడు అనే సినిమా ద్వారా హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభుదేవా ఆ తరువాత చాలా సినిమాల్లో హీరోగా చేశాడు. ఇక హీరోగా కొన్నాళ్ళు బాగానే కొనసాగినప్పటికి అతనికి మరికొన్నాళ్లకు వరుసగా అపజయాలు ఎదురయ్యాయి. అనంతరం దర్శకుడిగా అతను సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. నువ్వస్తాంటే నేనొద్దంటానా సినిమాతో దర్శకుడిగా ప్రభుదేవా కెరియర్ టర్న్ తీసుకున్నాడు.

Talented maker Prabhu Deva becomes a father for the fourth time

మొదటి కొడుకు మరణం:అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చారు. ఇక 2011లో తన భార్య రామాలత్ కి ప్రభుదేవా విడాకులు ఇచ్చేసి నయనతారని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకొని లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారు. నయనతార ప్రేమలో పడిన తర్వాత భార్యకి విడాకులు ఇచ్చాడు. విడాకులకి కొన్నేళ్ళ ముందు ప్రభుదేవా కొడుకు క్యాన్సర్ రావడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ అనారోగ్యంతో చనిపోయాడు.

Talented maker Prabhu Deva becomes a father for the fourth time

మరోసారి తడ్రైన ప్రభుదేవా:ఇక అయితే నయనతారని వివాహం చేసుకుందామని అనుకున్నా ఎందుకనో ఆ బంధం వీగిపోయింది. తరువాత బాలీవుడ్ దర్శకుడిగా బిజీ అయిపోయారు. అయితే 2020లో ముంబైకి చెందిన ఫిజియోథెరపిస్ట్ హిమాని సింగ్ తో ప్రభుదేవా ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరికి కూతురు పుట్టింది. ఈ విషయాన్ని తాజాగా ప్రభుదేవా దృవీకరించాడు.

Talented maker Prabhu Deva becomes a father for the fourth time

నయనతారతో విడిపోయిన తర్వాత..:మొదటి భార్యతో ముగ్గురు కొడుకులు కాగా రెండో భార్య ద్వారా మళ్ళీ కూతురుని పొందడం విశేషం. నయనతారతో విడిపోయిన తర్వాత హాన్సికతో కొంతకాలం ప్రేమాయణం సాగించినట్లు కోలీవుడ్ సర్కిల్ లో రూమర్స్ వినిపించాయి. అప్పటికే ప్రభుదేవా మొదటి భార్య రామాలత్, నయనతార మధ్య ప్రభుదేవా విషయంలో గొడవలు జరుగుతూ ఉండేవి. అదే టైమ్ లో హన్సిక తో ప్రభుదేవా చెట్టపట్టాల్ వేసుకొనితిరగడం పలు అనుమానాలకి తావిచ్చింది.

Talented maker Prabhu Deva becomes a father for the fourth time

సమయంలోనే ఆ రూమర్స్ వచ్చాయి:వారిద్దరూ కలిసి గులేబకావళి కథ అనే మూవీలో కలిసి నటించారు. ఈ సమయంలోనే ఆ రూమర్స్ వచ్చాయి. తరువాత రూమర్స్ ని హన్సిక ఖండించింది. ప్రభుదేవాని ఏకంగా అన్నాయ్య అనేసింది. మొత్తానికి నయనతార కారణంగా మొదటి భార్యకి విడాకులు ఇచ్చేసిన ప్రభుదేవా ఆమెతో కూడా బ్రేక్ అప్ చెప్పుకొని ఫైనల్ గా ఒక ఫిజియోథెరపిస్ట్ తో సెటిల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X