‘పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే.. శ్రీరెడ్డిని మాటలతో వదిలిపెట్టాం.. కానీ ఆ కుక్కలను అలా వదిలిపెట్టం‘

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అసత్య ఆరోపణలు, ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తున్న వారిపై బిగ్‌బాస్ సెలబ్రిటీ తమన్నా సింహాద్రి ఘాటుగా స్పందించారు. రాకేష్ మాస్టర్, శ్రీరెడ్డి లాంటి మరికొందరు తమ ఉనికి, పాపులారిటీ, స్వప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే లాక్‌డౌన్ పరిస్థితిని ఆసరాగా చేసుకొని చేస్తున్న వారికి ఆ తర్వాత తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. పవన్ కల్యాణ్‌ను ఎవరైనా అంటే సహించేది లేదని స్పష్టం చేశారు. యూట్యూబ్ ఛానెల్స్‌లో ఇంటర్వ్యూలు ఇస్తున్న పవన్‌పై స్పందిస్తున్న వారిపై ఘాటుగా స్పందిస్తూ..

జనసేన పార్టీకి దూరం కాలేదు

జనసేన పార్టీకి దూరం కాలేదు

జనసేన పార్టీకి నేను దూరం కాలేదు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ జనసేనతోనే ఉన్నాను..ఉంటాను. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నాకు టికెట్ ఇస్తుందని ఆశించాను. కానీ కొన్ని కారణాల వల్ల నాకు సీటు రాలేదు. ఆ సమయంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకొన్నాను. ఏ పార్టీలో చేరకుండా నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేశాను. జనసేన నుంచి బయటకు వెళ్లలేదు అని తమన్నా చెప్పారు.

పవన్ కల్యాణ్‌కు అభిమానినే

పవన్ కల్యాణ్‌కు అభిమానినే

జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్‌కు ఎప్పుడూ అభిమానినే. చాలా మంది పవన్ కల్యాణ్‌ను ఎందుకు తిడుతారంటే.. ఆయనను తిట్టినా.. ఆయన పార్టీని తిట్టినా.. పాపులారిటీ వస్తుంది. మీడియా కవరేజ్ వస్తుందనుకొంటున్నారు. ఆయన తిట్టడాన్ని ఆయుధంగా చేసుకొని పిచ్చి కుక్కలుగా మొరుగుతున్నారు. పవన్ తిట్టి కొందరు పేరు సంపాదించుకోవాలని చూస్తున్నారు అని తమన్నా పేర్కొన్నారు.

పాపులారిటీ కోసం పవన్‌పై విమర్శలు

పాపులారిటీ కోసం పవన్‌పై విమర్శలు

పవన్ కల్యాణ్ పేరును వాడుకొని పాపులారిటీని సంపాదించుకోవాలనే కుక్కలకు బుద్ది చెబుతాం. ఎవడో తిడితే పవన్ కల్యాణ్ వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి సమాధానం చెప్పడానికి మేము ఉన్నాం. కరోనా లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత వారి సంగతి చెబుదాం. మహిళ అయింది కాబట్టి శ్రీరెడ్డిని మాటలతో వదిలిపెట్టాం. మిగితా పిచ్చికుక్కలను చెప్పుతో కొడుతాం అని తమన్నా అన్నారు.

Recommended Video

Krrish 4 To Be a Multi Starrer Targets RRR Movie
మొరిగే కుక్కలకు బుద్ధి చెబుతాం

మొరిగే కుక్కలకు బుద్ధి చెబుతాం

జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి పవన్ కల్యాణ్ చాలా కష్టపడుతున్నాడు. పార్టీ, వ్యక్తిగత గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా సొంత డబ్బులతో పార్టీని నడుపుతున్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని కొన్ని ఊరకుక్కలు ఆయనపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఓ పార్టీ నడపాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఈ కుక్కలకు తెలుసా? వీళ్లు విమర్శించి ఏం చేస్తారు. లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడు మొరిగే కుక్కలకు తగిన బుద్ది చెబుతాం అని తమన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X