‘రాకేష్ మాస్టర్ పిచ్చికుక్క.. రోజా, చిరంజీవిని అనే స్థాయా? చెప్పుతో కొట్టాలి‘
యూట్యూబ్ ఛానెల్స్‌లో డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ చేస్తున్న హంగామాపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, రోజా లాంటి ప్రముఖులపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ సెలబ్రిటీ, ట్రాన్స్‌జెండర్ తమన్నా మండిపడ్డారు. ఆమె ఇటీవల యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

మహిళలను కించపరుస్తూ రాకేశ్ మాస్టర్
రాకేష్ మాస్టర్ అంటే గౌరవం ఉండేది. కానీ ఈ మధ్య ఆయన మాటలు చేస్తుంటే ఆయనపై ఉండే గౌరవం పోయింది. సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టుకొని ఏదో ఏదో వాగుతున్నాడు. ఆయన తాగి మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నది. మహిళలనే కనీస గౌరవం లేకుండా ఆయన మాట్లాడటం చూస్తే బాధగా ఉంది అని తమన్నా అన్నారు.

చిరంజీవిని ప్రశ్నించే మొనగాడా?
ప్రస్తుతం కరోనావైరస్ లాక్‌డౌన్ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో రాకేష్ మాస్టర్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం చాలా దారుణం. చిరంజీవి స్థాయిని, వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే మొనగాడా? రాకేష్ మాస్టర్ పిచ్చి కుక్క లాంటి వాడు. చిరంజీవి లాంటి వ్యక్తితో రాకేష్ మాస్టర్‌ను కలిపి మాట్లాడటం సిగ్గుచేటుగా అనిపిస్తుందని అన్నారు.

రోజాపై కూడా అవాకులు, చెవాకులు
ఇక రోజాపై కూడా రాకేష్ మాస్టర్ అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇంట్లో వంట చేస్తే ఈయనకు వచ్చిన కష్టం ఏమిటి? ఇంట్లో పిల్లలు, భర్త ఉంటే వంట చేయరా? అని తమన్నా ప్రశ్నించారు. కరోనా లాక్‌డౌన్‌లో ఆయనకు మందు ఎక్కడ దొరుకుతున్నదో అర్ధం కావడం లేదు. సారా తాగుతున్నాడో ఏమో.. హోష్ లేకుండా మాట్లాడుతున్నాడు. పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. గుడ్డలు చింపుకొనేలా ప్రయత్నిస్తున్నారు. ఆయన పరిస్థితి ఏమిటో అర్దం కావడం లేదు అని తమన్నా అన్నారు.
Recommended Video

పిచ్చికుక్కను చెప్పుతో కొట్టినట్టు
చిరంజీవి, రోజాలను విమర్శించే అర్హత రాకేష్ మాస్టర్‌కు ఉందా? అలాంటి వాడిని ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు. ఆయనను పిచ్చికుక్కును చెప్పుతో కొట్టినట్టు కొట్టాలి. కరోనావైరస్ పరిస్థితులు తగ్గిన తర్వాత ఆయన బండారం బయటపడుతుంది. ఆయన వెనుక ఎవరున్నారు? ఎవరు మాటాడుతున్నారనే విషయం బయటకు వస్తుంది అని తమన్నా సింహాద్రి అన్నారు.


Click it and Unblock the Notifications











