సినీ ఇండస్ట్రీలో చాలామంది 'గే' లు.. తమన్నా సంచలనం.. సీక్రెట్స్ రివీల్

Recommended Video

Tamanna Simhadri Sensational Comments on Uppal Balu And Tollywood || Filmibeat Telugu

ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి, ఉప్పల్ బాబు.. ఈ ఇద్దరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా విస్తరించడం కారణంగా ఇలాంటి కొత్త కొత్త వ్యక్తులు జనాలకు సుపరిచితంగా మారుతున్నారు. ఈ వారమే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో కాలుమోపిన తమన్నా.. ఇటీవల ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉప్పల్ బాలుని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో 'గే' ఉన్నారని చెప్పి షాకిచ్చింది.

టిక్ టాక్ ఫేం ఉప్పల్ బాలు

టిక్ టాక్ ఫేం ఉప్పల్ బాలు

సోషల్ మీడియాలో ఈ మధ్యనే భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న వ్యక్తి ఉప్పల్ బాలు. నాకు చాన్స్ వస్తే 'నా కసి మొత్తం తీర్చేసుకుంటా' అంటూ టిక్ టాక్‌కే తోపులా మారాడు ఉప్పల్ బాలు. ఆడ కాదు.. మగ కాదు అన్నట్లుగా అతను చూపించే 'కసి' సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసేస్తోంది. దీంతో సోషల్ మీడియా ఫేం అయ్యాడు ఉప్పల్ బాలు.

అలాంటి వీడియోలపై తమన్నా ఘాటు స్పందన

అలాంటి వీడియోలపై తమన్నా ఘాటు స్పందన

టిక్ టాక్ అంటూ కుప్పిగంతులు వేయగానే సెలబ్రిటీ అయిపోరు అని ఉప్పల్ బాలు వీడియోలపై ఘాటు విమర్శలు చేసింది తమన్నా. ఉప్పల్ బాలు చేష్టలు 'గే' కమ్యూనిటీని కించపరిచేలా ఉన్నాయని, వారి మనోభావాలను దెబ్బ తీస్తున్నాడని తమన్నా పేర్కొన్నారు. నిజంగా ఫేమస్ కావాలనుకుంటే సొంతంగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలే గానీ ఇలా 'గే'ల మనోభావాలతో ఆటలాడవద్దని తమన్నా ఘాటుగా హెచ్చరించారు.

 సినీ ఇండస్ట్రీలో చాలామంది 'గే'లు

సినీ ఇండస్ట్రీలో చాలామంది 'గే'లు

ఉప్పల్ బాలును విమర్శిస్తూనే తమన్నా టాలీవుడ్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు చాలామంది 'గే'లు తాము గే అనే విషయాన్ని దాచిపెడతారని, పబ్లిక్‌గా తాము 'గే' అని చెప్పుకోరని అని తమన్నా అన్నారు. ఈ నేపథ్యంలో అంతెందుకు సినీ ఇండస్ట్రీలోనూ చాలామంది బడాబాబులు 'గే'లుగా ఉన్నారని అన్నారు. ఉప్పల్ బాలును టార్గెట్ చేసే క్రమంలో తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

తమన్నా హెచ్చరికపై బాలు రియాక్షన్

తమన్నా హెచ్చరికపై బాలు రియాక్షన్

మరోవైపు తమన్నా సింహాద్రి చేసిన వ్యాఖ్యలకు ఉప్పల్ బాలు కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. అవును నిజమే, కుప్పిగంతులు వేసుకొనే సెలబ్రిటీ అయ్యాను.. నువ్వూ కుప్పిగంతులు వేసి నాలా పేరు తెచ్చుకో చూద్దాం అంటూ తమన్నాను ఆయన సవాల్ చేశాడు. తాను సెలబ్రిటీనా అని ప్రశ్నిస్తున్న తమన్నా మాత్రం సెలబ్రిటీ అనుకుంటోందా ఏంటి? అని అన్నాడు. తనకు వస్తున్న ఈ ఫేం చూసి ఓర్వలేకనే తమన్నా ఇలాంటి విమర్శలు చేస్తోందని ఉప్పల్ బాలు ఆరోపించాడు.

బిగ్ బాస్ హౌస్‌లో తమన్నా

బిగ్ బాస్ హౌస్‌లో తమన్నా

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీ షో నుంచి నటి హేమ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హేమ హౌస్ నుంచి బయటకు వచ్నిన వెంటనే ఇంట్లోకి ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. గతంలో శ్రీడ్డి కాస్టింగ్ కౌచ్ గొడవ సమయంలో హాట్ టాపిక్ అవ్వడంతో పాటు, ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేశ్‌పై పోటీ చేసి వార్తల్లో నిలిచిన తమన్నా సింహాద్రి... బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకొని వార్తల్లో నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X