బ్రోతల్ హౌసా.. నారాయణను చెప్పుతో కొట్టాలి.. తమన్నా సింహాద్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ఎక్కడో విదేశంలో మొదలైన బిగ్ బాస్ షో ఇప్పుడు ఇండియా మొత్తం మీద అన్ని బాషలలో మంచి టీఆర్పీ సాధిస్తోంది. తెలుగులో మాత్రమే కాక అన్ని భాషల్లో బిగ్‌బాస్‌ రియాలిటీ షో భారీ క్రేజ్ దక్కించుకుంది. తెలుగులో ఇప్పటికే 5 సీజన్లను విజయంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఓటీటీ ప్రసారానికి సిద్ధమైంది. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు ఈ షో ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీపీఐ నేత నారాయణ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బ్రోతల్ హౌస్ అని అంటూ కామెంట్లు చేయడంతో ఆయన మీద తమన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

అనైతిక చర్యలకు

అనైతిక చర్యలకు

రియాలిటీ షోగా చెబుతున్న 'బిగ్‌బాస్‌' లైసెన్స్‌ పొందిన ఒక అనైతిక షో అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు కోసం అనంతపురం వెళ్లిన ఆయన శనివారం నాడు విలేకరులతో మాట్లాడారు. బిగ్‌బాస్‌ అనే లైసెన్స్‌ పొందిన షోలో 100 మందిని 100 రోజుల పాటు ఒకచోట ఉంచి అనైతిక చర్యలకు పాల్పడేందుకు వీలు కల్పిస్తున్నారని ఆరోపించారు.

అవమానకరమని

అవమానకరమని

అన్నమయ్య వంటి సినిమాల్లో నటించిన హీరో నాగార్జున ఇలాంటి షోకు యాంకరింగ్‌ చేయడం అవమానకరమని పేర్కొన్న ఆయన ఈ షో ద్వారా ప్రజలకు ఏమి సందేశం ఇవ్వదల్చుకున్నారని ప్రశ్నించారు. మహిళలను అవమాన పరిచే విధంగా ఈ షో ఉంటుందన్న ఆయన దానిని ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్‌ చేశారు. షో నిలిపేయాలంటూ తాము డిజిటల్‌ క్యాంపెయిన్‌ చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

చెప్పుతో కొట్టాలి అని

చెప్పుతో కొట్టాలి అని


అయితే ఈ విషయం మీద ఒక టీవీ ఛానల్ లో డిబేట్ లో రచ్చ జరగగా డిబేట్ లో సీపీఐ నారాయణ మీద బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్, ట్రాన్స్ జెండర్ తమన్నా విరుచుకుపడింది. సీపీఐ నారాయణని చెప్పుతో కొట్టాలి అని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది తమన్నా. ఈ చర్చకు సీపీఐ నారాయణను కూడా పిలవాలని ఆమె కోరింది. బిగ్ బాస్ హౌస్ ను బ్రోతల్ హౌస్ అన్నందుకు కోపంతో ఊగిపోయిన తమన్నా.. ఇక్కడ ఉంటే చెప్పుతో కొట్టేదాన్ని అని అంటూ ఫైర్ అయ్యింది.

మంచిపేరు వచ్చిందని

మంచిపేరు వచ్చిందని

బిగ్ బాస్ వల్ల తమకు ఉపాధి లభించిందని.. మంచిపేరు వచ్చిందని చెప్పారు. దీంతో జనాలకు సులువుగా తెలుస్తున్నామని పేర్కొంది. మీకు నచ్చక పోతే చూడొద్దు.. కానీ నోటికి వచ్చినట్టు కామెంట్ చేయడం ఏంటి అని తమన్నా ప్రశ్నించింది. అలా మాట్లాడటం కరెక్ట్ కాదని ఆమె విరుచుకుపడింది. ఇక ఒక జాతీయ పార్టీ నేతను తమన్నా సింహాద్రి అలా అనడం మరో చర్చకు దారితీసింది.

 మొదటి సారి ఏమీ కాదు

మొదటి సారి ఏమీ కాదు


ఇక బిగ్ బాస్ మీద నారాయణ ఇలా కామెంట్ చేయడం ఇది మొదటి సారి ఏమీ కాదు. గతంలో కూడా ఆయన బిగ్ బాస్ మీద కామెంట్ చేశారు. అయితే కొందరు కంటెస్టెంట్లు దాని మీద ఖండించారు కూడా. అయితే ఆయన మీద ఒక కంటెస్టెంట్ ఈ రేంజ్ లో ఫైర్ అవడం మాత్రం ఇదే మొదటి సరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X