twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమన్నా, నభా అంత బోల్డ్‌గా నటించగలరా?.. ‘అంధాదున్’ రీమేక్‌లో అందమైన భామలు

    |

    యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఓ వైపు భీష్మ చిత్రం సూపర్ హిట్ అయింది. మరో వైపు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకోవైపు కోవిడ్ పుణ్యమా అని ఫ్యామిలీతో కావాల్సినంత సమయాన్ని గడిపాడు. ఇక మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. నితిన్ అంధాదున్ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఓ ప్రకటనను జారీ చేశారు.

    'నితిన్ మేర్లపాకి గాంధీ కాంబోలో శ్రేష్ట మూవీస్ నిర్మిస్తోన్న అంధాదున్ రీమేక్‌లో తమన్నా, నభా నటేష్‌లు నటించనున్నారు. హిందీ అంధాదున్‌కు అఫీషియల్ రీమేక్ అయిన ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నుంచి మొదలుకాబోతోంది. ఒరిజినల్ సినిమాలో టబు పోషించిన పాత్రను తమన్నా, రాధిక ఆప్టే పోషించిన క్యారెక్టర్‌ను నభా నటేష్ పోషించనున్నారు. ఇక ఈ సినిమాలోని పాత్రకు టబు నటనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. చివరగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ కూడా లభించింది. ఇక ఇప్పుడు అది తమన్నా వంతు. ఎన్నో షేడ్స్ ఉంటే భిన్న పాత్రను తమన్నా ఎంతో ఛాలెంజింగ్ తీసుకుంది.

    Tamannaah And Nabha Natesh In Andhadhun Remake

    ఈ చిత్రంలో ఉన్న ప్రతీ పాత్ర ముఖ్యమైందే. రాధిక ఆప్టే పాత్రను పోషించడానికి నభా సంతోషంగా ఉంది. ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాను శ్రేష్ట మూవీస్ బ్యానర్‌లో తమ ఆరో చిత్రంగా నిర్మించనుంది. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తారు. మిగతా నటీనటులు సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.. హరి కే వేదాంత్ కెమెరా‌మెన్‌గా పని చేస్తున్నారు' అని ప్రకటన విడుదల చేశారు.

    English summary
    Tamannaah And Nabha Natesh In Andhadhun Remake, Milky beauty tamannaahspeaks and ismart lady NabhaNatesh on board for #Andhadhun Remake actor_nithiin
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X