Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్‌మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తమన్నా, నభా అంత బోల్డ్‌గా నటించగలరా?.. ‘అంధాదున్’ రీమేక్‌లో అందమైన భామలు
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఓ వైపు భీష్మ చిత్రం సూపర్ హిట్ అయింది. మరో వైపు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకోవైపు కోవిడ్ పుణ్యమా అని ఫ్యామిలీతో కావాల్సినంత సమయాన్ని గడిపాడు. ఇక మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. నితిన్ అంధాదున్ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఓ ప్రకటనను జారీ చేశారు.
'నితిన్ మేర్లపాకి గాంధీ కాంబోలో శ్రేష్ట మూవీస్ నిర్మిస్తోన్న అంధాదున్ రీమేక్‌లో తమన్నా, నభా నటేష్‌లు నటించనున్నారు. హిందీ అంధాదున్‌కు అఫీషియల్ రీమేక్ అయిన ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నుంచి మొదలుకాబోతోంది. ఒరిజినల్ సినిమాలో టబు పోషించిన పాత్రను తమన్నా, రాధిక ఆప్టే పోషించిన క్యారెక్టర్‌ను నభా నటేష్ పోషించనున్నారు. ఇక ఈ సినిమాలోని పాత్రకు టబు నటనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. చివరగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ కూడా లభించింది. ఇక ఇప్పుడు అది తమన్నా వంతు. ఎన్నో షేడ్స్ ఉంటే భిన్న పాత్రను తమన్నా ఎంతో ఛాలెంజింగ్ తీసుకుంది.
ఈ చిత్రంలో ఉన్న ప్రతీ పాత్ర ముఖ్యమైందే. రాధిక ఆప్టే పాత్రను పోషించడానికి నభా సంతోషంగా ఉంది. ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాను శ్రేష్ట మూవీస్ బ్యానర్లో తమ ఆరో చిత్రంగా నిర్మించనుంది. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తారు. మిగతా నటీనటులు సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు.. హరి కే వేదాంత్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు' అని ప్రకటన విడుదల చేశారు.