‘గుర్తుందా శీతాకాలం’ అంటూ తమన్నాతో సత్యదేవ్ రొమాన్స్
ఓ భాషలో హిట్టయిన చిత్రాలు మరో భాషలోకి డబ్బింగ్ లేదా రీమేక్ కావడం ఎప్పటి నుంచో వస్తోంది. అయితే ఈ మధ్య మాత్రం ఈ రీమేక్స్ గోల ఎక్కువగా వినిపిస్తోంది. మలయాళం, కన్నడ నుంచి మనవాళ్లు కథలను తీసుకుంటుంటే.. మన కథలను బాలీవుడ్ వాళ్లు తీసుకుంటున్నారు. ఈక్రమంలో చాలా సినిమాలు హిందీకి పయనమయ్యాయి. ఇక మలయాళం నంచీ చాలానే కథలు తెలుగులో రీమేక్ కానున్నాయి.
మలయాళి చిత్రాలైన డ్రైవింగ్ లైసెన్స్, అయ్యప్పనుమ్ కోషియమ్, కపేలా వంటి చిత్రాలు తెలుగులో వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. తాజాగా కన్నడలో రూపొందిన ఓ లవ్ స్టోరీనీ తెలుగులో పరిచయం చేసేందుకు సిద్దమయ్యారు. కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన లవ్ మాక్‌టెయిల్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్దమైంది. ఈ రీమేక్ యంగ్ టాలెంటెడ్ సత్యదేవ్‌ను తీసుకున్నారు.

తెలుగులో గుర్తుందా శీతాకాలం పేరిట రీమేక్ కాబోతోన్న ఈ సినిమాల్ సత్యదేవ్ తమన్నాతో రొమాన్స్ చేయబోతోన్నాడు. నేడు ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకకు మాత్రం తమన్నా హాజరవ్వలేదు. ఈ చిత్రాన్ని నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై.. భావనరవి, నాగశేఖర్ నిర్మిస్తున్నారు. కాళ భైరవ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్య హెగ్డే కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











