Tamannaah- Vijay Varma Breakup: తమన్నా - విజయ్ తెగతెంపులు... అందులో కలిసే !

సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్లు, నటీనటుల మధ్య ప్రేమాయణాలు, ఎఫైర్స్, బ్రేకప్స్ సర్వసాధారణం. కొందరు స్టార్స్ బట్టలు మార్చినంత ఈజీగా తమ పార్ట్‌నర్‌ను మార్చేస్తారు. కానీ కొందరు మాత్రం ప్రేమించిన వ్యక్తితో పెళ్లీ పీటలెక్కి తమ జీవితాన్ని పండించుకుంటారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా - విజయ్ వర్మల బ్రేకప్ టాలీవుడ్ టూ బాలీవుడ్ కుదిపేస్తోంది. రేపో మాపో పెళ్లి పీటలెక్కుతారు అనుకున్న ఈ జంట తమ ప్రేమ జీవితానికి ముగింపు పలకడం చర్చనీయాంశమైంది.

హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన నాటి నుంచి తమన్నాపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. చివరికి పాకిస్తాన్ క్రికెటర్‌తోనూ ఆమె రిలేషన్ అంటగట్టారు. కానీ ఇవన్నీ గాలి వార్తలుగానే మిగిలిపోయాయి. అయితే రెండేళ్ల క్రితం నిజంగానే తమన్నా ప్రేమలో పడ్డారు. 2023లో వచ్చిన లస్ట్ స్టోరీస్ 2 చిత్రంలో నటించిన విజయ్ వర్మతో తమన్నా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని బీటౌన్ మీడియా కోడై కూసింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే తమన్నా - విజయ్ మధ్య పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ బహిరంగంగా చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో మీడియా వదిలిపెడుతుందా? రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి.

Tamannaah Bhatia and Vijay Varma are still together on the this matter

తప్పించుకునే వీలు లేకపోవడంతో వీరే తమ ప్రేమను బయటపెట్టారు. విజయ్ నాకోసం సృష్టించుకున్న అందమైన ప్రపంచంలోకి అడుగుపెట్టాడని , నన్ను ఎంతో అర్ధం చేసుకున్నాడంటూ అతనిపై తన ప్రేమను బయటపెట్టారు. ఇక నాటి నుంచి సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లు, ఫ్యాషన్ షో ఇతర కార్యక్రమాలకు తమన్నా - విజయ్ జంటగానే హాజరయ్యేవారు. ఇక విహారయాత్రలకైతే లెక్కేలేదు. మొన్నామధ్య స్నేహితులతో కలిసి గోవా వెళ్లి రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విజయ్ వర్మ బాలీవుడ్ నటుడిగానే చాలా మందికి తెలుసు. కానీ ఆయన పక్కా హైదరాబాదీ. 1986 మార్చి 29న హైదరాబాద్‌లోని మార్వాడీ కుటుంబంలో జన్మించిన విజయ్ ఇక్కడే చదువుకున్నారు. ఆయన తండ్రి వ్యాపారవేత్త కాగా.. విజయ్ 2005లో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి నటనలో శిక్షణ తీసుకున్నారు. చిట్టగాంగ్, రంగేజ్, గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్, పింక్ వంటి హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగు నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాలో విలన్‌గా కనిపించారు విజయ్.

తమన్నా - విజయ్‌లు సిన్సియర్‌గా ప్రేమించుకుంటున్నట్లుగానే అందరూ భావించారు. ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ అన్ని జంటలు పెళ్లి పీటలెక్కుతోన్న నేపథ్యంలో వీరు కూడా రేపో మాపో పప్పన్నం పెడతారని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా తమన్నా - విజయ్ వర్మ బ్రేకప్ వార్తలు ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశాయి. వీరిద్దరూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఏ కారణం వల్ల ఇద్దరూ విడిపోయారు? అనేది చర్చనీయాంశమైంది. తమన్నా త్వరగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా, విజయ్ మాత్రం కెరీర్‌పై ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నారని అందుకే ఈ జంట విడిపోయిందని సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయి.

Tamannaah Bhatia and Vijay Varma are still together on the this matter

ఇంత జరుగుతున్నా తమన్నా, విజయ్ వర్మలు ఈ బ్రేకప్ వార్తలపై స్పందించలేదు. అయితే ఓ విషయంలో మాత్రం వీరిద్దరూ కలిసే ఉన్నారు. సహజంగా చిత్ర సీమలో హీరో హీరోయిన్ల బ్రేకప్‌కు ముందు వారిద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు అన్‌ఫాలో చేసుకోవడం లేదంటే ఒకరి ఫోటోలు మరొకరు డిలీట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ తమన్నా- విజయ్ వర్మలు మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియా ఖాతాలలో కలిసే ఉన్నారు. పరస్పర అంగీకారంతో విడిపోయి, మంచి మిత్రులుగా కలిసే ఉందామని వీరు నిర్ణయించుకోవడం మంచి పరిణామంగా విశ్లేషకులు అంటున్నారు.

More from Filmibeat

Read more about: tamannaah bhatia vijay varma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X