హోలీ వేడుకల్లో జంటగా .. తమన్నా - విజయ్ బ్రేకప్ నిజం కాదా?

గత కొద్దిరోజులుగా భారతీయ సినీ రంగంలో తీవ్ర చర్చనీయాంశమైన విషయం ఏదైనా ఉందంటే అది హీరోయిన్ తమన్నా భాటియా - నటుడు విజయ్ వర్మల బ్రేకప్పే. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోయిందంటే అభిమానులు, సినీ ప్రముఖులు నమ్మలేకపోతున్నారు. ఒకటికి రెండు సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకుంటున్నారు. ప్రేమ, పెళ్లి, రిలేషన్ గురించి తమన్నా భాటియా సంచలన వ్యాఖ్యలు చేయడంతో వీరి మధ్య బ్రేకప్ నిజమేనని అంతా క్లారిటీకి వచ్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఓ చోట ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.

2023లో వచ్చిన లస్ట్ స్టోరీస్ -2 షూటింగ్ సమయంలో విజయ్‌తో పరిచయం , ప్రేమగా మారింది. చాలా వరకు తన సినిమాలు, వ్యాపారాల గురించే పట్టించుకునే తమన్నా ప్రేమలో పడేసరికి అంతా షాక్ అయ్యారు. లస్ట్ స్టోరీస్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా హాట్ హాట్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది మిల్కీ బ్యూటీ. తమన్నాను అలా చూడటానికి ఆమె అభిమానులు సైతం ఇష్టపడేలేదు. గ్లామర్ షో వరకు ఓకే కానీ కెరీర్‌లో ఎప్పుడూ లిప్ లాక్ సీన్స్‌లో కూడా తమన్నా నటించలేదు.

Tamannaah Bhatia and Vijay Varma attend Raveena Tandon s Holi celebration

లస్ట్ స్టోరీస్ 2 జనాల్లోకి వెళ్లడానికి కూడా తమన్నా - విజయ్‌ల ఎపిసోడ్ కారణమైంది. ఇలా ఉండగా ఓ రోజున తాను విజయ్‌తో ప్రేమలో ఉన్నట్లు తమన్నా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. విజయ్ తనను బాగా అర్ధం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. నాటి నుంచి సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లు, ప్రైవేట్ పార్టీలకు వీరిద్దరూ జంటగానే వెళ్లడం స్టార్ట్ చేశారు. ఇక వెకేషన్, టూర్‌లకు లెక్కేలేదు. మొన్నామధ్య ఫ్రెండ్స్‌తో కలిసి గోవా వెళ్లింది ఈ జంట. ఇద్దరూ వీడియో గేమ్ ఆడుతూ విజయ్, తమన్నా జోడి సందడి చేసింది.

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ సెలబ్రెటీలంతా ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉండటంతో తమన్నా - విజయ్‌లు కూడా పెళ్లి పీటలెక్కుతారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఇద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం అభిమానులకు మింగుడు పడలేదు. ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలో ఉన్న ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేయడంతో ఈ స్టార్ కపుల్ బ్రేకప్ నిజమేనని అంతా క్లారిటీకి వచ్చేశారు.

Tamannaah Bhatia and Vijay Varma attend Raveena Tandon s Holi celebration

ఈ వార్తల మధ్యనే తమన్నా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ , పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రిలేషన్‌లో కండీషన్స్ అనేవి ఎప్పుడు మొదలవుతాయో అక్కడ ప్రేమ ఉండదన్నారు. భాగస్వామి భావాలకు విలువ ఇవ్వాలని.. రిలేషన్‌లో ఉన్నప్పటి కంటే బయటికి వచ్చినప్పుడే సంతోషంగా ఉన్నానని తమన్నా చెప్పారు. అలాగే భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని యువతకు మిల్కీబ్యూటీ పిలుపునిచ్చారు.

తమన్నా - విజయ్ విడిపోయారని అంతా ఫిక్స్ అయిన వేళ ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లో తమన్నా , విజయ్ పాల్గొన్నారు. అయితే గతంలో కలిసి పార్టీలకు, వేడుకలకు హాజరైన ఈ జంట బ్రేకప్ తర్వాత మాత్రం విడి విడిగా రవీనా టాండన్ నివాసానికి చేరుకున్నారు. వీరిని తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా ప్రతినిధులు ఉత్సాహం చూపారు. ప్రస్తుతం తమన్నా - విజయ్‌ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: tamannaah bhatia vijay varma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X