ఐపీఎల్ కుంభకోణంలో తమన్నా,సంజయ్ దత్‌కు నోటీసులు.. 100 కోట్ల నష్టం అంటూ కేసు

ఇండియన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కోట్లాది రూపాయల కుంభకోణంలో ఇరుక్కుపోయిన మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ వ్యవహారంలో తమన్నాకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన ఫెయిర్ ప్లే యాప్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఆమెకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం నోటీసులు పంపడం సంచలనం రేపింది. ఈ కేసు విచారణలోకి వెళితే..

ముంబై నగరం నేపథ్యంగా ఫెయిర్ ప్లే అనే యాప్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ యాప్‌లో అనుమతి లేకుండా ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేసింది. ఈ యాప్ కోసం ఐపీఎల్ మ్యాచ్‌ చూడాలని తమన్నా యాడ్స్‌లో పాలుపంచుకొన్నారు. అయితే ఈ యాప్ వలన మాకు తీవ్ర నష్టం వాటిల్లిందని రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన వయాకామ్ 18 సంస్థ ఢిల్లీ హై కోర్టును ఇటీవల ఆశ్రయించింది.

Tamannaah Bhatia gets legal notices in IPL Related Fairplay App Scam by Maharastra Cyber Department

ఫెయిర్ ప్లే యాప్‌లో ఐపీఎల్ 2023 సంవత్సరపు మ్యాచ్‌లను స్ట్రీమింగ్ చేశారు. అనుమతి లేకుండా చట్ట విరుద్దంగా ఈ చర్యలకు పాల్పడ్డారు. ఈ యాప్‌తో భాగస్వామ్యం పంచుకొన్న తమన్నా భాటీయా, సంజయ్ దత్‌ను విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో వెల్లడించారు. వాస్తవానికి సంజయ్ దత్ ఏప్రిల్ 23వ తేదీన హాజరుకావాల్సి ఉంది.

అయితే ఈ యాప్ కుంభకోణంలో విచారణకు సంజయ్ దత్ విచారణకు గైర్హాజర్ అయ్యారు. వ్యక్తిగత, ప్రొఫెషనల్ కారణాల వల్ల ఈ విచారణకు హాజరు కాలేదు. మరో తేదీని కేటాయిస్తే.. దర్యాప్తుకు సహకరిస్తానని ఆయన కోరినట్టు సమాచారం. దాంతో మరో డేట్‌లో ఆయనను పిలువడానికి ప్లాన్ చేశారు.

ఇక ఇదిలా ఉంటే.. తమన్నాను ఏప్రిల్ 29వ తేదీన విచారణకు రావాలంటూ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆమె అ రోజున మహరాష్ట్ర సైబర్ సెక్యూరటీ సంస్థ నిర్వహించే విచారణకు హాజరు అవుతారా? లేదా అనేది చర్చనీయాంశమైంది. తమన్నా ఈ స్కామ్‌లో నోటీసులు అందుకోవడం సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి తీసింది.

ఇదిలా ఉండగా.. తమన్నా నటించిన బాక్ (అరణ్మనయి 4) చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం మే 3వ తేదీన రిలీజ్ కానున్నది. తమిళ నిర్మాత సుందర్ సీ నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నాతో చేసిన స్పెషల్ సాంగ్‌ ఇటీవల రిలీజై వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X