ఎర్రబుగ్గ కారులో తమన్నా భాటియా.. లిక్కర్ స్కామ్‌ నిందితుడితో మిల్కీ బ్యూటీ ఫోటోల రచ్చ

వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ వ్యవహారంలో తెలుగు స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా పేరు తెరపైకి రావడంతో సినీ రంగంలోను చర్చనీయాంశమైంది. ఆంధ్రాలో ఈ భారీ కుంభకోణానికి సంబంధం ఉన్న కీలక నిందితుడితో మిల్కీ బ్యూటీ తమన్నా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వెలుగు చూడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ వ్యవహారంలో తమన్నా ఫోటోలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ కేసు వివరాల్లోకి అలాగే.. తమన్నా వ్యవహారానికి సంబంధించిన వివాదంలోకి వెళితే..

గత ప్రభుత్వ హాయంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్‌లో అనుమానితులు, నిందితులుగా భావిస్తున్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, పైలా దిలీప్, వెంకటేష్ నాయుడు, బూనేటి చాణక్య, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారందరూ రిమాండ్‌పై జైలులో ఉన్నారు.

Tamannaah Bhatia Photo

అయితే ఈ నిందితుల్లో కీలక వ్యక్తి, A34‌గా నిందితుడైన సీహెచ్ వెంకటేష్ నాయుడితో తమన్నా భాటియా ప్రత్యేక విమానంలో ప్రయాణించడం, జెట్ ఫ్లయిట్‌లో వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వెలుగులోకి రావడం షాకింగ్‌గా మారాయి. దాదాపు 3500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం నిందితుడిని ఎందుకు కలిశారు? ఆయనతో ఎక్కడికి ప్రయాణం చేశారు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.

అయితే జెట్ ఫ్లయిట్ ప్రయాణానికి సంబంధించిన ఫోటోను పక్కన పెడితే.. ఎయిర్‌పోర్టులో హై సెక్యూరిటీ జోన్‌లో వీవీఐపీ ప్రోటోకాల్ ఉన్న నేతలకు ఇచ్చే ఎర్రబుగ్గ కారు పక్కనే తమన్నా ఉండటం, ఆమె పక్కనే వెంకటేష్ నాయుడు కూడా ఉండటం అనేక అనుమానాలు రేకెత్తించాయి. అంతేకాకుండా ఎర్రబుగ్గ కారులో ఆమె ప్రయాణించిందా? ఆ కారు ఎవరి కాన్వాయ్‌లోనిది అని ఆరా తీస్తున్నారు.

అయితే వెంకటేష్ నాయుడితో తమన్నాకు సంబంధం ఏమిటి? వారిద్దరూ ఎక్కడికి వెళ్లారు? ఏ రాజకీయ నాయకుడిని కలిశారు. ఏపీ ప్రభుత్వంలోని కీలక నేతను కలిశారా? లేదా తెలంగాణ సర్కారులోని కీలక నేతను కలిశారా? వీఐపీ ప్రోటోకాల్ కారును తమన్నా కోసం ఎందుకు ఉపయోగించారు? ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ జోన్‌లో ఎర్రబుగ్గ కారు పార్క్ చేయింది ఎవరు? అనే ప్రశ్నలను నెటిజన్లు సంధిస్తున్నారు. ఈ వ్యవహారం ముదిరితే.. తమన్నాను సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఒకవేళ తమన్నాను సిట్ అధికారులు ప్రశ్నిస్తే.. ఈ కుంభకోణంలో బడా నేతలు పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో తమన్నాను విచారణకు పిలుస్తారా? వెంకటేష్ నాయుడు కాల్ లిస్టులో తమన్నా హిస్టరీ ఏమిటి? అనే విషయాలు ప్రస్తుతం కీలకంగా మారాయనే వాదనలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X