‘తమన్నాతో స్పెషల్ ఫ్లయిట్.. వెంకటేష్ ఆర్థిక స్థోమత ఎంత? ఎవరెవరు? ఎంతమంది ఎక్కారు?’

లిక్కర్ స్కామ్‌లో A34 అరెస్ట్ అయిన వెంకటేష్ నాయుడుతో సినీ హీరోయిన్ తమన్నా భాటియా వ్యవహారంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా స్పందించాడు. మద్యం కుంభకోణంలో వెంకటేష్ నాయుడి పేరు బయటకు రావడం.. ఆయనతోపాటు తమన్నా కలిసి స్పెషల్ జెట్ ఫ్లయిట్‌లో ట్రావెల్ చేయడం.. అలాగే.. తమన్నా కోసం ఎర్రబుగ్గ కారును కూడా వాడటం వివాదంగా మారింది. అయితే ఈ వ్యవహారంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..

లిక్కర్ కుంభకోణం నిందితుల రాసలీలలు చూస్తే మతిపోతున్నది. వారు అనుభవించిన రాజభోగాలు చూస్తే షాకింగ్‌గా ఉంది. హీరోయిన్‌తో వారు సాగించిన ప్రయాణాల ఫోటోలు మీడియాలోను, సోషల్ మీడియాలో కనిపించాయి. నేను ఆ హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడటం ఇష్టం లేదు. కానీ బయటకు వచ్చింది ఒకే ఒక ఫోటో. ఇంకా ఎన్ని ఫోటోలు ఉన్నాయి? ఎన్ని ఫ్లయిట్స్‌లో తిరిగారు. ఇంకా ఎన్ని ఉన్నాయనే విషయం బయటకు రావాలి అని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.

Tamannaah Bhatia

అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు అధికారులకు విన్నపం ఏమిటంటే? లిక్కర్ స్కామ్‌లో ఎన్ని ఫ్లయిట్స్ ఉపయోగించారు? ఎంత మంది స్పెషల్ ఫ్లయిట్ ఎక్కారు? జెట్ ఫ్లయిట్‌లో ఎవరెవరూ ఎక్కారు? ఎంతెంత డబ్బు కట్టారు? అనే విషయంపై లోతైన అధ్యయనం చేయించాలి. ఇక లిక్కర్ స్కామ్‌లో నిందితుడు వెంకటేష్ నాయుడు వ్యవహారంపై క్షుణ్ణంగా విచారణ జరిపించాలి అని ఆయన డిమాండ్ చేశారు.

ఇక మద్యం కుంభకోణంలో 34వ నిందితుడు వెంకటేష్ నాయుడు కోటిశ్వరుడు కాదు. ఆయన వెల్లడించిన ఆస్తులు, చెల్లించిన ఇన్‌కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే.. కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఆయన సంవత్సర ఆదాయం 20, 30 లక్షలకు మించి ఉండదని ఆయన వెల్లడించిన ఆస్తుల చిట్టా ప్రకారం బయటకు వచ్చింది. అలాంటి వ్యక్తి ప్రైవేట్ ఫ్లయిట్ ఎలా ఎక్కాడు? హీరోయిన్ పక్కన పెట్టుకొని విహరిస్తుంటాడు. ఆ స్థోమత రావాలంటే.. ఎంత డబ్బు ఉండాలి? అని ఆనం బ్రదర్ ప్రశ్నించాడు.

Anam Venkata Ramana Reddy

ఓ స్టార్ హీరోయిన్‌తో ప్రైవేట్ ఫ్లయిట్‌లో వెళ్లారంటే.. ఆ నిర్మాత కాదే.. సినిమాలు తీయలేదే.. స్టోరీ డిస్కషన్ కోసం హీరోయిన్‌తో వెళ్లాడా? ఇంకా మరే పనిమీద వెళ్లాడా? అనే విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వ్యక్తి ఒంగోలులో చెవిరెడ్డి భాస్కరరెడ్డికి డమ్మీ నామినేషన్ ఫైల్ చేశాడు. తనకు కారు కూడా లేదని ఎలక్షన్ నామినేషన్ పత్రంలో వెల్లడించారు. అలాంటి వ్యక్తి ప్రైవేట్ జెట్‌ను ఎలా ఉపయోగిస్తాడు. ఇలాంటి వ్కక్తి మాకు, మా పార్టీకి సంబంధం లేదని అంటున్నారు అని ఆనం అనుమానాలను వ్యక్తం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X