Tamannaah Bhatia యంగ్ హీరోతో రొమాంటిక్‌గా.. అదిరిపోయే కెమిస్ట్రీతో మిల్కీబ్యూటీ
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, యంగ్ హీరో సత్యదేవ్ జంటగా యువ దర్శకుడు నాగ శేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిలైన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్‌లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటనలను ప్రేక్షకులకు గుర్తు చేసే ప్రయత్నాన్ని నాగశేఖర్ మూవీస్ బ్యానర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు సంయుక్తంగా గుర్తుందా శీతాకాలం సినిమాను అందిస్తున్నారు.
శీతాకాలం గుర్తుందా సినిమా నిర్మాతల్లో ఒకరు రామారావు చింతపల్లి వరుస చిత్రాలతో తన మార్కును చూపించుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తూ అభిరుచిగల నిర్మాతగా ప్రశంసలు అందుకొంటున్నారు. గుర్తుందా శీతాకాలం నిర్మాణంలో ఈయన భాగస్వామ్యం చాలా ఉంది.

హీరో సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు నటిస్తున్న సినిమాపై ఇప్పటికే యూత్‌లో మంచి ఆసక్తి నెలకొన్నది. తమన్నా భాటియా, సత్యదేవ్ రొమాంటిక్ లవ్ స్టోరి అంచనాలు పెంచుతున్నది. కన్నడ సూపర్ హిట్ చిత్రం లవ్ మాక్‌టైల్ ఆధారంగా గుర్తుందా శీతాకాలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో సత్యదేవ్, తమన్నా కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్‌గా మారింది. గుర్తుందా శీతాకాలం సినిమాను సెప్టెంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
నటీనటులు: సత్యదేవ్, తమన్నా భాటియా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి తదితరులు
స్కీన్ ప్లే, దర్శకత్వం: నాగశేఖర్
బ్యానర్: నాగశేఖర్ మూవీస్
సమర్పణ: ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు
నిర్మాతలు: భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి
పబ్లిసిటీ డిజైనర్స్ : అనిల్, భాను
కొరియోగ్రఫి: వీజే శేఖర్
లైన్ ప్రొడ్యూసర్స్: సంపత్, శివ ఎస్. యశోధర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ రెడ్డి
డైలాగ్స్: లక్ష్మీ భూపాల్
మ్యూజిక్: కాలభైరవ
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రాఫర్: సత్య హెగ్డే
స్టంట్స్: వెంకట్
పీఆర్వో: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
రిలీజ్ డేట్: 2022-09-23


Click it and Unblock the Notifications











