twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఎవడన్నాడు ఆ మాట'.. బిల్డప్ రూమర్స్ పై చిర్రెత్తిపోయిన తమన్నా

    |

    టాలీవుడ్ మిల్కి బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ తమన్నా భాటియా. జయపజయలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ పై ఇటీవల బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. విషయం తెలుసుకున్న తమన్నా ఒక్కసారిగా చిరకుతో ఆగ్రహం వ్యక్తం చేసింది.

    మిల్కి బ్యూటీ కెరీర్ @15

    మిల్కి బ్యూటీ కెరీర్ @15

    2005లో మంచు మనోజ్ శ్రీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమన్నా కొంత కాలంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకుంది. దాదాపు టాలీవుడ్ లో అందరి హీరోలతో అమ్మడు స్క్రీమ్ షేర్ చేసుకుంది. అవకాశం చిన్నదైనా పెద్దదైనా.. బేధాలు లేకుండా నటించి బిజీ ఆర్టిస్ట్ గా మారింది. ఈ 15ఏళ్ళల్లో తమన్నా ఒక్క ఏడాది కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఎదో ఒక సినిమా చేస్తూనే ఉంది.

    హిట్స్ లేకపోయినా..

    హిట్స్ లేకపోయినా..

    ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుందని తమన్నా సౌత్ ఇండస్ట్రీలో ఒక క్రేజ్ ను అందుకుంది. ఇక మిల్కీ బ్యూటీ అదృష్టం ఏమిటో గాని ఇన్నాళ్లు హిట్స్ లేకపోయినా అదే ఫ్లోని మెయింటైన్ చేస్తూ వచ్చింది. అప్పుడప్పుడు బాలీవుడ్ సైడ్ కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్న తమన్నా ఎందుకో గాని అక్కడ సక్సెస్ కాలేకపోయింది. కానీ తెలుగులో మాత్రం ఎదో ఒక పనితో బిజీ అవుతూనే ఉంది.

     తమన్నా బిల్డప్..

    తమన్నా బిల్డప్..

    రూమర్స్ గురించి పెద్దగా పట్టించుకోని తమన్నా రీసెంట్ గా ఒక షాకింగ్ రూమర్ పై పట్టరాని కోపానికి గురయ్యింది. ఇటీవల ఆమె అవకాశాలు తగ్గుతున్నాయని టాలీవుడ్, కోలీవుడ్ ని వదిలే పరిస్థితి ఏర్పడిందని, ఇక బిల్డప్ కోసం బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా రిజెక్ట్ చేసినట్లుగా తమన్నా ప్రచారం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

    Recommended Video

    Vishal's Action Movie Public Talk
    ఎవడన్నాడు ఆ మాట..

    ఎవడన్నాడు ఆ మాట..

    మీడియాలో వస్తున్న రూమర్స్ కు ఎట్టకేలకు తమన్నా కౌంటర్ ఇచ్చింది. నాకు పని దొరకడం లేదని ఎవడన్నాడు. అంతగా బిల్డప్ చూపిస్తున్నట్లు చెప్పడం ఏ మాత్రం కరెక్ట్ కాదని తమన్నా చిర్రెత్తుకొచ్చింది. ప్రస్తుతం చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయని చెబుతూ.. బాలీవుడ్ కి ఇప్పుడిపుడే తాను అలవాటు పడుతున్నట్లు తెలిపింది. ఇక తనకు ఎక్కువగా తెలుగులో నటించడమే అనుకూలంగా ఉందని వివరణ ఇచ్చింది.

    English summary
    Thamannaah Bollywood career is not as successful in comparison with her Tollywood journey. This naturally startled the actress. In a latest interview with a leading news agency, Tamannaah said that her being out of employment was the most bizarre news,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X