ఆ దర్శకుడితో తమన్నా మరోసారి.. F2 తర్వాత జోరుగా

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మ్యాచో హీరో గోపీచంద్‌తో జతకట్టేందుకు మిల్కీ బ్యూటీ రెడీ అవుతున్నారు. గోపిచంద్ హీరో‌గా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ "ప్రొడక్షన్ నెం.3" గా శ్రీనివాసా చిట్టూరి మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే చిత్రంలో తమన్నాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా సంపత్ నంది ట్వీట్ చేస్తూ అందాల తార తమన్నా భాటియాకు స్వాగతం, గోపిచంద్ 28వ చిత్రంలో ఆమె నటిస్తున్నది. రచ్చ, బెంగాల్ టైగర్ తర్వాత మూడోసారి కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నాం అని పేర్కొన్నారు.

గతంలో సంపత్ నంది దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ 'బెంగాల్ టైగర్'లో తమన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. గోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం పాల్గొంటున్నది. ఈ చిత్రానికి సమర్పణ: పవన్ కుమార్ కాగా, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ నంది.

Tamannaah Bhatia to pair up Gopichand for Sampath Nandi

ఇక బాహుబలి చిత్రంతో యుద్ధనేపథ్యమున్న చిత్రంలో నటించిన తమన్నా మరోసారి సైరాలో కత్తి పట్టింది. సైరాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. సైరా చిత్రం అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ఇక గోపిచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో గౌతమ్ నందా వచ్చింది. ఈ చిత్రం తర్వాత మళ్లీ రెండోసారి వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X