తమన్నాకు బాలీవుడ్‌లో భారీ ఆఫర్.. ఏ హీరోతో పక్కనంటే!
బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న రితేష్ దేశ్‌ముఖ్ మరోసారి నిర్మాతగా మారనున్నారు. ఓ కామెడీ చిత్రాన్ని రూపొందించేందుకు ప్రణాళికను సిద్దం చేసినట్టు బాలీవుడ్ మీడియా సమాచారం. అయితే హీరోయిన్‌గా తమన్నా భాటియాను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.
పక్కా హాస్య చిత్రంగా రూపొందే ఈ సినిమా కోసం రితేష్ టీమ్ వర్క్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రం ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని అనుకొంటున్నట్టు తెలుస్తున్నది.
ఇటీవల తమన్నా భాటియాకు రితేష్ టీమ్ కథ చెప్పగా ఆమె సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఇంకా ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అధికారికంగా ప్రకటించలేదని.. త్వరలోనే ఈ సినిమా వివరాలను వెల్లడించనున్నట్టు యూనిట్ తెలిపింది.

ఇక నిర్మాతగా రితేష్ విషయానికి వస్తే.. ఎల్లో, బాలక్ పాలక్, మౌళి, ఫాస్టర్ ఫెనీ చిత్రాను నిర్మించారు. ఆయన సతీమణి జెనీలియా దేశ్‌ముఖ్ తన ప్రొడక్షన్ వ్యవహారాల్లో పాలుపంచుకొంటున్నారు.
తమన్నా కెరీర్ విషయానికి వస్తే.. క్వీన్ రీమేక్ మహాలక్ష్మి విడుదల కావాల్సి ఉంది. తెలుగులో సీటీమార్, గుర్తుందా సీతాకాలం చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి చుడియాన్ అనే మూవీలో యాక్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











