అతడితో గొప్ప అనుభవం.. జోష్‌లో తమన్నా భాటియా
బాలీవుడ్, టాలీవుడ్‌లో రాణిస్తున్న హీరోయిన్ తమన్నా భాటియా తన పాత్రలను ఎంచుకోవడంలో వైవిధ్యం చాటుకొంటారు. తాజాగా నవంబర్ స్టోరి అనే వెబ్ సిరీస్‌లో ఎథికల్ హ్యాకర్‌గా ఓ డిఫరెంట్ పాత్రను పోషించబోతున్నారు. దర్శకుడు రామ్ సుబ్రమణ్యం రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రంలో పశుపతి, జీఎం కుమార్, అరుల్ దాస్, వివేవక్ ప్రసన్న తదితరులు నటిస్తున్నారు.
నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్‌లో ఆల్జీమర్స్ వ్యాధి బారిన పడిన తండ్రి చికిత్స కోసం ఇంటిని అమ్ముకొనే యువతిగా, ఎథికల్ హ్యాకర్‌గా కనిపించబోతున్నారు.

అనురాధ స్వతంత్ర భావాలు ఉన్న యువతి. భయం తెలియని తెలివైన అమ్మాయి. తండ్రిని కాపాడుకోవడానికి ఓ హంతకుడిని శిక్షించే వ్యక్తిగా నటించనున్నారు. నా కెరీర్‌లో ఓ బలమైన క్యారెక్టర్ అంది. ఈ పాత్రను పోషించడం ఓ ఛాలెంజ్ మాత్రమే కాదు.. దర్శకుడితో పనిచేయడం గొప్ప అనుభవం అంటూ తమన్నా వెల్లడించారు.
నవంబర్ స్టోరి అనేది వెబ్ సిరీస్ క్లాసిక్ మర్డర్ మిస్టరీ. కొన్ని వాస్తవాలు, మరుగున పడి ఉన్న మరికొన్ని నిత్య సత్యాలను ఈ వెబ్ సిరీస్‌లో ఆవిష్కరిస్తున్నాం. తమిళ ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని ఓ క్రైమ్ థ్రిలర్ ఇది. కథ, కథనాలు అద్భుతంగా ఉంటాయి అని దర్శకుడు రామ్ సుబ్రమణ్యం అన్నారు.


Click it and Unblock the Notifications











