Naga Chaitanya: నాగచైతన్యపై తమన్నా ప్రాంక్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన హీరో.. అసలేం జరిగిందంటే?

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గురించి తెలుగు సినీ ప్రేక్షుకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండే ఈయన ఈ మధ్య తన సినిమాలు, వెబ్ సిరీస్ లలో ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఇటీవేల యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించి అందరికీ షాకిచ్చారు. ఇదంతా ఇలా ఉండగా.. తాజాగా ఆయన తన మొదటి వెబ్ సిరీస్ దూత వీడియో ప్రమోషన్ కోసం ముంబయి వెళ్లారు. అక్కడే టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా భాటియాను కలిశాడు. ఈక్రమంలోనే మిల్క్ బ్యూటీ తమన్నా హీరో నాగ చైతన్యను ప్రాంక్ చేయాలనుకుంది.

అయితే తాను మేకప్ వేసుకుంటుండగా నాగ చైతన్య అక్కడకు వెళ్లాడు. వెంటనే అతడిని చూసి లేచిన తమన్నా హాయ్ చెప్పి.. ఇదేంటి నువ్వు ఇక్కడ అంటూ అడిగింది. అందుకు నాగ చైతన్య కూడా ఆమెతో చక్కగా మాట్లాడి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్లు పిలిస్తే వచ్చానని వివరించాడు. ఇక ఆ తర్వాత అవునా.. ఇది నా సెట్ అని తమన్నా చెప్పగా.. నన్ను కూడా ఇక్కడకే రమన్నారని నాగ చైతన్య చెబుతాడు. వెంటనే తన షూటింగ్ పేపర్లు తీసుకొచ్చి మరీ చైకు చూపిస్తుంది తమ్మూ బేబీ.

Tamannaah Bhatia Try to Prank Akkineni Naga Chaitanya Check Details

అలాగే ఒకసారి టీం వాళ్లకు ఫోన్ చేయు అంటూ నాగచైతన్యకు సూచిస్తుంది. దీంతో వెంటనే చై ఫోన్ తీసుకొని ఫోన్ చేసేస్తాడు. ఇక్కడ తమన్నా ఉందంటూ చెబుతుండగానే.. ఆమె ఫోన్ తీస్కొని మాట్లాడి పెట్టేస్తుంది. కాస్ట్ కట్టింగ్ కోసం ఒక చోట రెండు మూడు షూటింగ్స్ పెట్టినట్లున్నారని ఇద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్తారు. అక్కడకు వెళ్లగానే బెలూన్లతో రూం అంతా డెకరేట్ చేసి ఉండడం చూసిన చై.. ఇదేదో చిన్న పిల్లల బర్త్ డే పార్టీ అని అంటాడు. కానీ తమన్నా అక్కడే ఉన్న ఓ బోర్డుపై కవర్ ను తీసేసి.. వెల్ కమ్ టు అమెజాన్ ప్రైమ్ వీడియో చై అని చెబుతుంది.

దీనికి షాకైనట్లు నటించిన నాగ చైతన్య తమన్నాకు థాంక్స్ చెబుతాడు. ఇక ఆ తర్వాత హగ్ చేసుకొని నీకోసం ఒకటి తెచ్చానంటూ ఓ చీటీ ఇస్తాడు. చదవమని చెప్పగా.. తమన్నా దాన్ని చదివి షాకవుతుంది. అయితే ఆ చీటోలో.. తమన్నా మిమ్మల్ని ప్రాంక్ చేయబోతుందని రాసి ఉండడం చూసి నీకు ఇది ఎవరిచ్చారంటూ ప్రశ్నిస్తుంది. దానికి చై సనాధానం కూడా చెప్పకుండా.. టు నో మోర్.. వాచ్ దూత అని చెప్పాడు. అయితే దూత అనే వెబ్ సిరీస్ లో నాగ చైతన్య నటించారు.

తనతో ఇప్పటికే రెండు సినిమాలు తీసిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్, నాగ చైతన్య కాంబోలో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను... ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో రూపొందించింది. మొత్తం 8 ఎపిసోడ్లు కల్గిన ఈ వెబ్ సిరీస్.. డిసెంబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ ను శరద్ మరార్.. ప్రైమ్ వీడియోతో కలిసి నిర్మించారు. ఈక్రమంలోనే నాగ చైతన్య ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X