twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఇంటి కోసం రెట్టింపు ధర చెల్లించిన తమన్నా... ప్రత్యేకత ఏమిటో?

    |

    హీరోయిన్ తమన్నా సినిమా ఇండస్ట్రీలో దాదాపు 15 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళం, హిందీలో స్టార్ హీరోయిన్ హోదా పొందారు. ఒక్కో సినిమాకు కోటి పై చిలుకు రెమ్యూనరేషన్ తీసుకునే ఈ మిల్కీ బ్యూటీ...ఇటు కమర్షియల్స్ యాడ్ ఫిల్మ్స్, సొంతగా కొన్ని వ్యాపారాలు చేస్తూ చేతినిండా సంపాదిస్తోంది. తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని స్థిరాస్థులు కొనడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు.

    తాజాగా తమన్నా ముంబై వెస్ట్ సబర్బ్‌లోని వెర్సోవా ప్రాంతంలో ఒక లగ్జరీ అపార్టుమెంటులో ఫ్లాట్ కొనుగోలు చేసింది. అయితే దీని కోసం ఆమె చెల్లించిన ధర చర్చనీయాంశం అయింది. సముద్రం వ్యూ అందంగా కనిపించే ఈ అపార్ట్‌మెంట్ కోసం ఆమె రెట్టింపు ధర చెల్లించిందట.

     Tamannaah bought 16.60 cr apartment in Versova

    ఒక్కో స్కేర్ ఫీట్ కోసం రూ. 80,778 చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది ఆ ఏరియాలో ఉన్న సాధారణ ధర కంటే రెట్టింపు మొత్తంగా చెబుతున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌కు 500 మీటర్ల దూరంలో ఒక్కో స్కేర్ ఫీట్ రూ. 35,000 నుంచి రూ. 40,000 ధరలో లభిస్తోందట.

    బిల్డర్ సమీర్ భోజ్వానీ నుంచి ఆమె ఈ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిందని, గత నెలలోనే అగ్రిమెంట్ కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 2055 స్కేర్ ఫీట్స్ వైశాల్యం కలిగిన ఈ ఫ్లాట్ కోసం తమన్నా రూ. 16.60 కోట్లు ఖర్చు చేసిందట. రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కింద రూ. 99.60 లక్షలు చెల్లించినట్లు సమాచారం.

    బేవ్యూ పేరుతో నిర్మించి 22 అంతస్తులు కలిగిన ఈ అపార్టుమెంటులో 14వ అంతస్తులో తమన్నా ఫ్లాట్ ఉన్నట్లు తెలుస్తోంది. సమీర్ భోజ్వానీ నుంచి ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు ఉందని... కొనుగోలుదారులుగా తమన్నా భాటియాతో పాటు ఆమె తల్లి రజనీ భాటియా పేరు ఉందని సమాచారం.

    ప్రస్తుతం తమన్నా ఫ్యామిలీ లోఖండ్‌వాలా అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. త్వరలోనే వారు ఈ కొత్త అపార్టుమెంటులోకి మూవ్ అవుతారని తెలుస్తోంది. అంతే కాదు ఇంటీరియర్ డిజైనింగ్ కోసం మరో రూ. 2 కోట్లు అదనంగా ఖర్చు పెడుతున్నట్లు టాక్.

    English summary
    Actress Tamannaah has bought the apartment from builder Sameer Bhojwani and she signed the agreement last month. The daily has confirmed that the actress has paid Rs 16.60 crore for a 2055 sqft apartment in Versova. She is said to have paid Rs 99.60 lakh as stamp duty to register the apartment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X