ఆ డైరెక్టర్ అడగడంతో కాదనలేకపోయా.. అవన్నీ రూమర్సే.. ఓపెన్ అయిన తమన్నా
ఈ న్యూ ఇయర్ స్పెషల్ హీరోయిన్ ఎవరు అంటే అది ఖచ్చితంగా మిల్కీబ్యూటీ తమన్నానే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని పార్టీ సాంగ్ న్యూ ఇయర్ సందర్బంగా హైలైట్ అయింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన తమన్నా.. తనపై వస్తున్న రూమర్లపై ఓపెన్‌గా స్పందించింది. ఆ వివరాలు చూద్దామా..

మహేష్ బాబుతో కలిసి తమన్నా..
ఇటీవలే న్యూ ఇయర్ కానుకగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు' పార్టీ సాంగ్ తెగ హంగామా చేస్తోంది. ఈ పాటలో మహేష్ బాబుతో కలిసి తమన్నా వేసిన చిందులు హైలైట్ అయ్యాయి. దేవీ శ్రీ అందించిన బాణీలు సంగీత ప్రియులను మత్తెక్కిచ్చాయి. కొత్త సంవత్సరం సందర్బంగా ఈ పాటతో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు జనం.

డైరెక్టర్ అడగడంతో కాదనలేకపోయా
ఈ స్పందన చూసిన తమన్నా.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన పాత్ర ఉండటం గురించి తమన్నా కామెంట్స్ చేసింది. తనకు ‘ఎఫ్ 2'లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి అడగడంతో నో చెప్పలేకపోయానని పేర్కొంది. ఏడాదిలో మనం 20 సినిమాలు చేసినప్పటికీ.. చివరి సినిమా విజయం మనల్ని సంతోషంగా ఉంచుతుందని తమన్నా తెలిపింది.

అందుకే ఇలా పార్టీ సాంగ్ చేశా అనుకున్నారు కానీ..
ఇక తనకు పనిలేక ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నానని, అందుకే ఇలా పార్టీ సాంగ్ లో నటించానని తన గురించి చాలా వదంతులు ప్రచారంలో ఉన్నాయని చెబుతూ వాటి గురించి మాట్లాడింది. ఆ వదంతులు నిజం కాదని, సంవత్సరంలోని 365 రోజులు తాను పని చేస్తూనే ఉంటానని తెలిపింది. ప్రస్తుతం తన చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయని తమన్నా వెల్లడించింది.

కొన్నేళ్లుగా సత్తా చాటుతూ.. ప్రెసెంట్ తమన్నా
సౌత్ సినిమాల్లో కొన్నేళ్లుగా సత్తా చాటుతూ వస్తున్న తమన్నా.. ఇటీవలే ‘సైరా నరసింహారెడ్డి'లో లక్ష్మి పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడేమో పార్టీ సాంగ్‌తో కుర్రకారును మాయ చేసేందుకు బరిలోకి దిగింది. అలాగే ప్రస్తుతం ‘బోలె చూడియా', ‘సీటీమార్' సినిమాల్లో తమన్నా నటిస్తోంది. ఇక టైటిల్ రోల్ పోషించిన ‘దట్ ఈజ్ మహాలక్ష్మి' సినిమా విడుదల కావాల్సి ఉంది.

సరిలేరు నీకెవ్వరు మూవీ
ఇక సరిలేరు నీకెవ్వరు మూవీ విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. తమన్నా పార్టీ సాంగ్‌లో నటించింది. చిత్ర నిర్మాణంలో హీరో మహేష్ బాబు కూడా భాగం కావడం విశేషం. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











