అలాంటిది చేసి చాలా రోజులైంది.. మరీ ఆతృతగా ఉంది: తమన్నా
ఈ రోజుల్లో హీరోయిన్లే ఐటెం భామలు. ప్రేక్షకులను ఉర్రుతలూగించేందుకు స్పెషల్ బ్యూటీస్ అంటూ అవసరం లేకుండా పోయింది. స్టార్ హీరోయిన్లే అందాలు ఆరబోస్తూ తెగ చిందులేస్తున్నారు. ఈ బాటలోనే వెళుతున్న హీరోయిన్లలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒకరు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో తమన్నా మాస్ మసాలా సాంగ్ చేయనున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే ఈ సాంగ్ సెట్స్ పైకి రానుంది.
కాగా తాజాగా ఈ సాంగ్ గురించి తనదైన స్టైల్ కామెంట్ చేసింది తమన్నా. తాను ఓ మాస్ పాటకు స్టెప్పులేసి చాలా రోజులైందని, అందుకే ఈ పాట కోసం చాలా ఎదురుచూస్తున్నానని తెలిపింది. పైగా ఈ పాటకు దేవి శ్రీ సంగీతం అందిస్తారు కాబట్టి మరీ ఆతృతగా ఉందని చెప్పింది. వచ్చే నెల మొదటి వారం నుంచే ఈ పాటను సెట్స్ పైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సాధారణం గానే తమన్నా సూపర్ డాన్సర్. అలాంటిది స్పెషల్ సాంగ్, అందునా మహేష్ బాబు పక్కన అంటే ఇంకేమన్నా ఉందా!. థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయమే మరి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.


Click it and Unblock the Notifications











