హీరోని బెడ్‌రూమ్ లోకి తీసుకొచ్చి రెచ్చిపోయిన తమన్నా.. నీ కోసమే ఈ జిలేబీ అంటూ
మెరిసే అందం తమన్నా సొంతం. సెగలు పుట్టించే ఆ అందానికి ఆమె లోని రొమాంటిక్ సెన్స్ అడిషనల్. ఈ రెండింటితో ప్రేక్షకులకు పిచ్చెకించడం తమన్నా నైజం. రొమాంటిక్ పాట చేయాలంటే తమన్నాను మించిన మరో ఆప్షన్ ఉండదేమో! ఈ విషయం అర్థం చేసుకున్న దర్శక నిర్మాతలు తమ తమ సినిమాల్లో తమన్నాలోని రొమాంటిక్ సెన్స్ అంతా పిండేసి ప్రేక్షకులకు ధారపోస్తుంటారు. తమన్నా లేటెస్ట్ మూవీ అభినేత్రి సినిమాలో కూడా అదే జరిగింది. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ఓ పాటలో తమన్నా రెచ్చిపోయి నర్తించింది.

రొమాన్స్‌కి రెడీ అంటూ..
తాను రొమాన్స్‌కి రెడీగా ఉన్నానంటూ ఓ భార్య తన భర్తతో చెప్పుకుంటున్న శృగార భర్తితమైన వీడియో సాంగ్ ఇది. ''రెడీ రెడీ రెడీ ఐయామ్ రెడీ'' అంటూ సాగే ఈ పాటను తమిళంలో ప్రభుదేవా రాయగా.. తెలుగు సాహిత్యాన్ని వనమాలి అందించారు. నిన్సీ విన్సెంట్ ఆలపించారు. పాటలో సాహిత్యానికి తగ్గట్టుగా తమన్నా ఈ వీడియోలో పిచ్చ పిచ్చగా రెచ్చిపోయింది. స్టెప్పులు, రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు ఫీజులు ఎగరగొట్టేసింది.
హీరోని బెడ్‌రూమ్ లోకి తీసుకొచ్చి
ప్రభుదేవాను రొమాన్స్ కోసం రెచ్చగొట్టిన తమన్నా చివరకు ఆయనను హీరోని బెడ్‌రూమ్ లోకి తీసుకొచ్చి తన వాంఛ తీర్చుకుంది. ఈ పాటలో తమన్నా చూపిన శృంగారభరిత హావభావాలు క్షణం కూడా చూపు తిప్పనివ్వడం లేదు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను వేడెక్కిస్తూ వైరల్ అవుతోంది. దీనికి తోడు అందాలు ఆరబోసే దుస్తుల్లో చాలా సెక్సీగా కుర్రకారు మనసు దోచుకుంది తమన్నా.

అభినేత్రి 2 మూవీ
2016లో వచ్చిన చిత్రం ‘అభినేత్రి' సినిమాకు సీక్వల్ గా అభినేత్రి 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో ప్రభుదేవా, తమన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైడెంట్ ఆర్ట్స్, అభిషేక్ పిక్చర్స్ పతాకాలపై అభిషేక్ నామా, ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నారు. తొలిభాగాన్ని తెరకెక్కించిన విజయ్ ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు.

అభినేత్రి 2 తారాగణం.. ఇతర విశేషాలు
ఈ చిత్రంలో ప్రభుదేవా, తమన్నాలతో పాటు నందితాశ్వేత, డింపుల్ హయాతి, కోవై సరళ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అభినేత్రి 2 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











