ఆ పని పూర్తి చేసిన తమన్నా.. ఫినిష్ అంటూ పోస్ట్ పెట్టేసింది

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. చిరంజీవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తమన్నా, అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా 'సైరా' హిందీ వెర్షన్‌ కోసమై తన పాత్రకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంది తమన్నా. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించిన తమన్నా.. ''ఇప్పుడే 'సైరా' హిందీ వెర్షన్‌లో నా క్యారెక్టర్‌ డబ్బింగ్‌ పూర్తి చేశా. లక్ష్మీ పాత్రలో నటించడం అద్భుతమైన అనుభవం'' అని పేర్కొంది. గతంలో కూడా ఊపిరి, ఎఫ్ 2 సినిమాల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది తమన్నా.

Tamannaah Finished Dabbing Work For Chiranjeevis Sye Raa Narasimha Reddy

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. చిరంజీవి కెరీర్ లో రాబోతున్న తొలి చారిత్రాత్మక చిత్రం కావడంతో ఈ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X