జ్వాలారెడ్డిగా మారిన మిల్కీ బ్యూటీ.. అదిరిపోయిన సీటీమార్ ఫస్ట్‌లుక్
దర్శకుడు సంపత్ నంది చాలా రోజుల తరువాత మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. చివరగా గోపీచంద్ హీరోగా వచ్చిన గౌతమ్ నందా చిత్రంలో నటించాడు. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. అయితే మరోసారి గోపీచంద్-సంపత్ నంది సీటీమార్ అంటూ కలిసి రావడం అందరిలోనూ ఆసక్తిని రేకేత్తిస్తోంది. దీనికి తోడు ఈ మధ్య విడుదల చేసిన గోపీచంద్ ఫస్ట్‌లుక్‌కు విపరీతమైన స్పందన రావడంతో అంచనాలు పెరిగాయి.
అసలే హిట్టు లేక సతమతమవుతున్న గోపీచంద్, గ్యాప్‌లతో నెట్టుకొట్టుస్తున్న సంపత్ నంది, సరైన సోలో సక్సెస్‌ను అందుకుని చాలా కాలం అవుతున్న తమన్నాలకు ఈ సీటీమార్ సక్సెస్ కావడం చాలా కీలకం. అందుకే ఈ మూవీ కథకథనాలను కూడా కాస్త కొత్తగా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేసినట్ట తెలుస్తోంది.

సీటీమార్ సినిమా కబడ్డీ నేపథ్యంలో జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కబడ్డీ కోచ్‌గా గోపీచంద్ నటించబోతోన్నాడని ఫస్ట్ లుక్‌తోనే అర్థమవుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి తమన్నా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. జ్వాలా రెడ్డిగా కబడ్డీ కోచ్ పాత్రలో నటించనుందని పోస్టర్ ద్వారా తెలిపారు. బెంగాల్ టైగర్ చిత్రం ద్వారా సంపత్ నందితో ఇది వరకే పని చేసింది తమన్నా. మళ్లీ ఇది రెండో సారి. ఈ సారి కూడా సక్సెస్ కొడుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











