twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లెవెంత్ అవర్’ను పూర్తి చేసిన తమన్నా.. రీఎంట్రీలో రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే స్టార్లు వెలుగొందుతారు. అలాంటి హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. మంచు మనోజ్ నటించిన 'శ్రీ' అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో భాగమైంది. అదే సమయంలో అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఫలితంగా చాలా కాలం పాటు తన హవాను చూపించింది. దీంతో అమ్మడు దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది.

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మిల్కీ బ్యూటీ తమన్నా.. చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపేది. అయితే, ఈ మధ్య అమ్మడు చాలా స్లో అయింది. దీంతో చాలా తక్కువ సినిమాల్లోనే నటిస్తోంది. అదే సమయంలో స్టార్ హీరోల మూవీల్లో స్పెషల్ నెంబర్స్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే తమన్నా డిజిటల్ మీడియా రంగంలోకి అడుగు పెట్టబోతుంది. అది కూడా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఆమె యాక్టింగ్‌తో రెచ్చిపోతుందని అంటున్నారు.

     Tamannaah First Web Series 11th Hour Completed

    ప్రస్తుతం తమన్నా.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'లెవెంత్ అవర్' అనే వెబ్ సిరీస్‌లో చేస్తోంది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వీడియో దీన్ని నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన చిత్రీకరణ తాజాగా ముగిసింది. ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా వెల్లడించింది. వాస్తవానికి దీని చిత్రీకరణ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. అయితే, తమన్నా కరోనా బారిన పడడంతో అది కాస్తా ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో ఆమె కోలుకుని వచ్చిన తర్వాత షూటింగ్ వేగం పెంచి శనివారంతో పూర్తి చేశారు.

    ఇదిలా ఉండగా, తమన్నా భాటియా ప్రస్తుతం గోపీ చంద్ హీరోగా వస్తున్న 'సిటీమార్'తో పాటు సత్యదేవ్ నటిస్తున్న 'శీతాకాలం'లోనూ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ఆమె నటించిన 'దటీజ్ మహాలక్ష్మీ' షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

    English summary
    The digital debut of a big-screen star is always a special affair. It increases the value of the digital portal. After all, a big star, making their debut in a digital web series or film helps them in building trust with the audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X