‘భోళా శంకర్‌’లో చిరంజీవి సరసన కుర్ర హీరోయిన్: కాజల్ తర్వాత ఆ రికార్డు ఈ భామదే

దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతూ.. ఇప్పటికీ అదే గ్రేస్, అదే ఫాలోయింగ్‌తో హవాను చూపిస్తూనే ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. కెరీర్ తొలినాళ్లలోనే ఎన్నో విజయాలను అందుకుని సత్తా చాటారు. అప్పటి నుంచి వరుస చిత్రాలు చేస్తూనే ఉన్నారు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నా.. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. ఇక, సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. సినిమాల మీద సినిమాలు చేస్తూ తన సత్తాను చాటి చెప్పుకుంటూనే ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. ఈ మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే చిరు.. మరో మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో ఒకటి మలయాళ చిత్రం లూసీఫర్‌కు రీమేక్‌గా వస్తున్న 'గాడ్ ఫాదర్' కాగా.. మరొకటి తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా వస్తున్న 'భోళా శంకర్'. వీటితో పాటు యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ మరో సినిమాను చేస్తున్నారు. ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారాయన.

Tamannaah Fix for Chiranjeevis Bholaa Shankar

చిరంజీవి ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది 'భోళా శంకర్'. దీనికి కారణం ఈ మూవీని ఫ్లాప్ దర్శకుడిగా పేరొందిన మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండడమే. సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ సోదరిగా ప్రముఖ హీరోయిన్ మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇక, ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ షూట్ కూడా పూర్తి చేశాడట. అలాగే, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయనే టాక్ వినిపిస్తోంది.

సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిశాయని అంటున్నారు. తన పాత్రకు కూడా ప్రాధాన్యం ఉండడంతో ఆమె వెంటనే ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక, ఇప్పటికే తమన్నా.. రామ్ చరణ్‌తో కలిసి నటించింది. ఇప్పుడు చిరంజీవితో చేయబోతుంది. దీంతో కాజల్ పేరిట ఉన్న ఆ రికార్డును ఇప్పుడు ఈమె కూడా అందుకుంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి టాక్సీ డ్రైవర్‌గా గుండుతో కనిపించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇది ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమిళ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి దీన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అలాగే, ఇందులో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటింబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X