బాలయ్యకు షాకిచ్చిన మరో స్టార్ హీరోయిన్..చిరంజీవితో సై..ఈయనకు మాత్రం నై.!

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. నందమూరి తారక రామారావు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన ఆయన.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. 1980, 90వ దశకాల్లోనే సరికొత్త ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఔరా అనిపించారు.

దీంతో బాలయ్యకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే హిట్లు వచ్చినప్పుడు పొంగిపోకుండా.. ఫ్లాపులు పలకరించినప్పుడు క్రుంగిపోకుండా ముందుకు వెళ్తున్నారు. ఈ మధ్య ఆయనకు కాలం కలిసి రావడం లేదు. ఇలాంటి సమయంలో తాజాగా ఓ హీరోయిన్ కూడా ఆయనకు షాకిచ్చింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.? పూర్తి వివరాల్లోకి వెళితే...

బాలయ్య ఆశలన్నీ అడియాసలు అయ్యాయి

బాలయ్య ఆశలన్నీ అడియాసలు అయ్యాయి

గత ఏడాది నందమూరి బాలకృష్ణ మూడు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. వాటిలో తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రెండు భాగాలు కాగా, మరొకటి కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రూలర్'. ఏడాది ఆరంభంలో వచ్చిన సినిమాల తాలూకు లోటును రూలర్‌తో పూడ్చుకుందామనుకుంటే ఇది కూడా అంతగా ఆడలేదు.

హిట్లు ఇచ్చిన డైరెక్టర్‌తో కలిశాడు

హిట్లు ఇచ్చిన డైరెక్టర్‌తో కలిశాడు

గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ మూడోసారి జత కట్టారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే ముగిశాయి. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

ఇద్దరికీ హిట్ కావాలి.. అందుకే ఇలా

ఇద్దరికీ హిట్ కావాలి.. అందుకే ఇలా

అటు బోయపాటి శ్రీనుకు.. ఇటు బాలయ్యకు హిట్ తప్పక కావాల్సిన పరిస్థితి ఇది. అందుకే ఈ సారి కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ చేయాలనే పట్టుదలతో ఇద్దరూ పని చేస్తున్నారు. ముఖ్యంగా బోయపాటి ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్, నటీ నటులు, టెక్నీషియన్ల ఎంపిక సహా మరికొన్ని పనులపై దృష్టి సారించారు.

ఆ విషయంలో క్లారిటీ రావడం లేదు

ఆ విషయంలో క్లారిటీ రావడం లేదు

ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ఇందులో నటించే వారి గురించే చాలా వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరినీ ఈ సినిమా కోసం ఫైనల్ చేయలేదు. అన్నింటి కంటే ముఖ్యమైన హీరోయిన్ పాత్ర విషయంలో ఎంతో మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో క్లారిటీ మాత్రం రావడం లేదు.

బాలయ్యకు షాకిచ్చిన మరో స్టార్ హీరోయిన్

బాలయ్యకు షాకిచ్చిన మరో స్టార్ హీరోయిన్

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో నటించేందుకు గానూ మిల్కీ బ్యూటీ తమన్నాను బోయపాటి శ్రీను ఇటీవల సంప్రదించాడట. అయితే, ఇందులో నటించేందుకు ఆమె నో చెప్పిందని అంటున్నారు. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా ఈ మూవీలో నటించడం లేదని స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

చిరంజీవితో సై.. బాలయ్యకు మాత్రం నై.!

చిరంజీవితో సై.. బాలయ్యకు మాత్రం నై.!

తమన్నా కొద్ది రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతూనే ఉంది. ఒకప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆమె.. ఇప్పుడు మాత్రం ద్వితీయ శ్రేణి హీరోలతో నటిస్తోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి'లో ఆమె కీలక పాత్ర చేసింది. ఇప్పుడు బాలయ్య సినిమాకు మాత్రం నో చెప్పిందని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X