మహేష్ బాబుతో ఓ రేంజ్‌లో ఉంటుంది.. మోత మోగాలి.. తమన్నా రియాక్షన్
సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతోంది తమన్నా. ఆయన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'లో ఐటెం సాంగ్ చేసేందుకు సిద్ధమైంది ఈ మిల్కీ బ్యూటీ. ఇంకేముంది ఈ వార్త తెలిసి మహేష్ అభిమానులు ఇప్పుడే పండగ చేసుకుంటున్నారు. తమన్నా అందాల విందులో మహేష్ చిందులు చూడాలని కుతూహల పడుతున్నారు. ఈ లోగా మహేష్‌తో డాన్స్ గురించి కామెంట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది తమన్నా. వివరాల్లోకి పోతే..

ఈలలు, గోలలతో నానా హంగామా చేసేలా
మహేష్ బాబుతో తాను చేయబోయే ఈ సాంగ్ ఓ రేంజ్‌లో ఉంటుందని అంటోంది తమ్మూ. సాంగ్ వస్తుంటే థియేటర్లన్నీ హోరెత్తిపోతాయని అంటోంది. మహేష్ అభిమానులంతా ఈలలు, గోలలతో నానా హంగామా చేస్తారని చెప్పింది తమన్నా. 'సరిలేరు నీకెవ్వరు'లో పరిచయ గీతం ఉంటుందని, అందులో మహేష్‌తో తాను ఓ రేంజ్ చిందులేస్తానని చెప్పింది తమన్నా.

మోత మోగాలి.. ఆతృతగా ఉంది
గతంలో 'ఆగడు' సినిమాలో మహేష్ బాబుకు జంటగా నటించిన తమన్నా.. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు'లో ఐటెం సాంగ్ చేస్తోంది. ఈ సందర్బంగా ఓ మీడియాతో మాట్లాడిన తమన్నా.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ మహేష్ బాబుతో స్టెప్పులేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఈ సాంగ్‌తో మోత మొగాలని అనేసింది. డిసెంబర్ నెలలో ఈ సాంగ్ చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం.

తమన్నా సొగసు.. భారీ పారితోషికం
మరోవైపు ఈ ఐటెం సాంగ్ యమ ఫాస్ట్ బీట్‌తో క్లాస్, మాస్ ఆడియన్స్ చేత కేకలు పెట్టించేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. పైగా ఈ సాంగ్‌లో మహేష్ బాబుతో తమన్నాను చిందులేపించాలని, తమన్నా సొగసు పాటకు స్పెషల్ డోస్ ఇచ్చేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం తమన్నాకు భారీ పారితోషికం కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం.

సరిలేరు నీకెవ్వరు మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా రూపొందుతోంది 'సరిలేరు నీకెవ్వరు' మూవీ. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

సైరాలో తమన్నా..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో లక్ష్మి పాత్రలో నటించింది తమన్నా. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ద్వారా తమన్నా క్యారెక్టర్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పేశారు మేకర్స్. అక్టోబర్ 2న
ఈ సినిమా విడుదల కానుంది. అలాగే గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న మరో సినిమాలోనూ నటిస్తోంది తమన్నా.


Click it and Unblock the Notifications











