Tamannaah: తమన్నాతో సత్యదేవ్ రొమాన్స్.. మరి అందంగా ఉంది మన రేంజ్ కాదంటూ

విభిన్నమైన సినిమాలు, పాత్రలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు సత్యదేవ్. ఇటీవల గాడ్సే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్.. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే హిందీలో యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రామ్ సేతు చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు.

ఇక మిల్కీ బ్యూటి తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. తమన్నా, సత్యదేవ్ తొలిసారిగా జంటగా నటించిన లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం గుర్తుందా శీతాకాలం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

సత్యదేవ్ కి ఐదో సినిమా..

సత్యదేవ్ కి ఐదో సినిమా..

సత్యదేవ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో మరింత పాపులారిటీ పెంచుకునే దిశలో పయనిస్తున్నాడు. ఇక మిల్కీ బ్యూటి ఇప్పటికే స్డార్ డమ్ ఉన్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వీళ్లిద్దరికి ఈ 2022వ సంవత్సరంలో ఐదో సినిమాగా వస్తున్న చిత్రం గుర్తుందా శీతాకాలం. సత్యదేవ్.. ఈ ఏడాదిలో గాడ్సే చిత్రంలో హీరోగా చేశాడు. ఆ తర్వాత ఆచార్యలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నాడు. అలాగే గాడ్ ఫాదర్ లో విలన్ గా మెప్పించాడు. రామ్ సేతు సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఇలా ఇప్పటికీ నాలుగు సినిమాలు కాగా ఇప్పుడు ఇదే సంవత్సరం సత్యదేవ్ ఐదో సినిమాగా గుర్తుందా శీతాకాలం రాబోతుంది.

తమన్నాకు కూడా 5వదే..

తమన్నాకు కూడా 5వదే..

అలాగే తమన్నాకు కూడా గుర్తుందా శీతాకాలం ఐదో సినిమానే. తమన్నా... వరుణ్ తేజ్ గని చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. తర్వాత ఎఫ్ 3 మూవీలో వెంకటేష్ సరసన జోడీ కట్టింది. హిదీలో బబ్లీ బౌన్సర్ గా డైరెక్ట్ ఓటీటీలో విడుదల అయింది. దీంతోపాటు ప్లాన్ ఏ ప్లాన్ బి అంటూ నేరుగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు తమన్నాకు ఈ సంవత్సరం ఐదో సినిమాగా గుర్తుందా శీతాకాలం రానుంది. ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. లవ్ అండ్ రొమాంటిక్ గా సాగిన ఈ ట్రైలర్ లో ఎమోషన్స్ కూడా ఉన్నాయి.

హీరో జీవితంలోని తదితర దశలతో ట్రైలర్..

హీరో జీవితంలోని తదితర దశలతో ట్రైలర్..

గుర్తుందా శీతాకాలం సినిమా ట్రైలర్ లో స్కూల్, కాలేజీ లవ్ స్టోరీ, బ్రేకప్, ట్రావెలింగ్, మ్యారేజ్ వంటి హీరో జీవితంలోని తదితర దశలను చూపించారు. సత్యదేవ్ క్రికేట్ ఆడే స్టైల్, హెలీక్యాప్టర్ షాట్ బాగున్నాయి. అమ్మాయిలతో తిరిగే సన్నివేశాలు చూపించారు. నీ అంతా క్లాస్ ఫిగర్ ను పడేస్తానని అనుకోలేదు, గురూజీ అంటూ ప్రియదర్శికి సత్యదేవ్ పెట్టే నమస్కారం నవ్వు తెప్పిస్తుంది. స్కూల్, టీనేజ్ లవ్, బ్రేకప్ తర్వాత మెచ్యూర్డ్ లవ్, పెళ్లి విషయాలను చూపించారు. మెచ్యూర్డ్ మ్యారేజ్ ట్రాక్ లో తమన్నా కనిపించింది. సత్యదేవ్, తమన్నా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.

మరి అందంగా ఉందిరా..

మరి అందంగా ఉందిరా..

నీకు కావాల్సిన అమ్మాయి కనిపించినప్పుడు ప్రకృతి నీకు చెబుతుందిరా అంటూ ప్రియదర్శి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. లవ్ లో ప్రాబ్లమ్ ఉంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవచ్చురా.. కానీ లవరే ప్రాబ్లమ్ అయితే అంటూ ప్రియదర్శి చెప్పే డైలాగ్ ఎమోషనల్ గా ఉంటుంది. అప్పుడే తమన్నాను చూపిస్తూ మరి అందంగా ఉందిరా.. మన రేంజ్ కాదురా అని డౌట్ గా సత్యదేవ్ చెప్పడం.. తర్వాత కట్ చేస్తే ఫస్ట్ నైట్ గదిలో తమన్నా, సత్య దేవ్ ఉంటారు. నీకిది ఇదంతా కొత్తేమ్ కాదేమో అని తమన్నా అంటే.. చేయలేదని కాదు.. చిన్న చిన్న టిఫిన్స్ అంటూ క్యూరియాసిటీ పెంచారు.

ఇష్టమైనది చేయడమే కదా..

ఇష్టమైనది చేయడమే కదా..

అరేయ్ దేవ్ ఆలోచించడం మానేయిరా.. హార్ట్ కి అమ్మాయిలకు కొంచెం రెస్ట్ ఇవ్వు, నీ లైఫ్ లో ఇంకెప్పుడైనా ఎవర్నైనా మళ్లీ లవ్ చేసే ఛాన్స్ ఉందా, ప్రేమించడం అంటే.. మనకు ఇష్టమైన వాళ్ల కోసం ఇష్టమైనది చేయడమే కదా అని చెప్పే డైలాగ్స్ చాలా బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ డైలాగ్స్ అందరికీ కనెక్ట్ అవుతాయనేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే స్కూల్, టీనేజ్, మెచ్యూర్డ్ లవ్ అంటూ ఇలాంటి తరహా కథలు ఇదివరకు చాలా వచ్చాయి. అయితే ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

మొదటిసారిగా లవ్ స్టోరీ..

గుర్తుందా శీతాకాలం సినిమాకు కాల భైరవ సంగీతం అందించగా.. నాగ శేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో తమన్నాతోపాటు మేఘా ఆకాష్, కావ్యా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఎమ్ఎస్ రెడ్డి, చినబాబు సమర్పణలో భావన రవి, రామారావు చింతపల్లితో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా ఉంటే మొదటిసారిగా సత్యదేవ్ ఓ లవ్ స్టోరీలో నటించాడు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X