ఏం చెప్పాలి రా నీ గురించి! రామ్ చరణ్‌‌పై తమన్నా కామెంట్.. అది కూడా పెద్దాయన ముందే..

Recommended Video

Tamannaah Speech At Sye Raa Narasimha Reddy Success Meet

ఎంతో స్నేహం ఉంటే గానీ ఒకరిని ఏకవచనంతో పిలవడం అనేది అసాధ్యం. ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఓకే గానీ ఇతరులను ఏకవచనంతో పిలవడం అంటే ఒకింత ధైర్యం చేసినట్లే. లేదా ఆ ఇద్దరి మధ్య అమితమైన స్నేహం లేదా ప్రేమ ఉన్నట్లే. అలాంటి ఓ సందర్భమే రామ్ చరణ్‌కి ఎదురైంది. హీరోయిన్ తమన్నా అందరి ముందే అతన్ని ఏకంగా 'రా' అనేసి షాకిచ్చింది. దీంతో ఈ టాపిక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అలా అనాల్సిన సందర్భం ఏంటి? తమన్నా ఎందుకిలా రియాక్ట్ అయింది. వివరాల్లోకి పోతే..

సైరా నరసింహా రెడ్డి విజయోత్సవం.. షాకిచ్చిన తమన్నా

సైరా నరసింహా రెడ్డి విజయోత్సవం.. షాకిచ్చిన తమన్నా

చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమా తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో థాంక్యూ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో మాట్లాడిన తమన్నా.. రామ్ చరణ్‌తో తనకున్న సాన్నిహిత్యం ఎలాంటిదో తన మాటల్లోనే బటయపెట్టింది. చిత్రయూనిట్, మీడియా ముందే తమన్నా ఇంత ఓపెన్ కావడం అందరికీ షాకిచ్చింది.

సైరాలో లక్ష్మిగా తమన్నా

సైరాలో లక్ష్మిగా తమన్నా

రామ్ చరణ్ నిర్మించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో లక్ష్మి పాత్రలో నటించింది తమన్నా. దీనికి మంచి స్పందన రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన తమన్నా.. థ్యాంక్యూ మీట్ లో ఎక్సయిట్ అయింది. ఈ పాత్రలో తన నటనకు ప్రత్యేక ప్రశంసలు లభిస్తున్నాయని, చిరంజీవి సినిమాతో ఇలాంటి ప్రశంసలు రావడం తనకెంతో సంతోషమనిపించిందని తెలిపింది.

మనసులోని మాట బయటపెట్టిన తమన్నా

మనసులోని మాట బయటపెట్టిన తమన్నా

సైరా సక్సెస్ మీట్‌లో మాట్లాడిన మిల్కీ బ్యూటీ పేరు పేరునా చిత్రయూనిట్ అందరికీ కృతజ్ఞతలు చెప్పింది తమన్నా. చిరంజీవితో మళ్లీ మళ్లీ నటించాలనుందని ఈ సందర్బంగా తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇక ఈ అవకాశం ఇచ్చిన సురేందర్ రెడ్డికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదని ఆమె తెలిపింది.

ఏం చెప్పాలి రా నీ గురించి అంటూ

ఏం చెప్పాలి రా నీ గురించి అంటూ

ఇక చివరగా రామ్ చరణ్ దగ్గరికి వచ్చిన తమన్నా.. ''నిన్ను నిర్మాతగా చూడాలా? హీరోగా చూడాలా? ఏం చెప్పాలి రా నీ గురించి'' అనేసింది. వేదికపై చిరంజీవి సహా యూనిట్ అంతా ఉండగానే చరణ్‌ను ఇలా అనేసిందంటే ఆ ఇద్దరి మధ్య స్నేహం ఏ రేంజ్ లో ఉందో అర్థంచేసుకోవచ్చు. గతంలో రచ్చ సినిమాలో తమన్నా, రామ్ చరణ్ కలిసి నటించారు. అప్పటి నుంచే ఈ ఇద్దరు మంచి స్నేహితులు.

సైరా నరసింహా రెడ్డి విశేషాలు

సైరా నరసింహా రెడ్డి విశేషాలు

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విజయంతో రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X