బిగ్ సర్‌ప్రైజ్: సరిలేరు నీకెవ్వరులో తమన్నా.. ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం

Recommended Video

Tamannaah Special Song In Sarileru Neekevvaru

తన గత చిత్రం 'మహర్షి' సూపర్ సక్సెస్‌ అవడంతో జోష్ మీదున్నాడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. ఈ ఫలితంతో అదే ఊపులో మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. అదే.. 'సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన లుక్స్, సాంగ్స్‌కు భారీ స్పదన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతోంది.

కామెడీకే పెద్దపీట

కామెడీకే పెద్దపీట

‘సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మహేశ్ ఆర్మీ మేజర్‌గా కనిపించినప్పటికీ కామెడీ ట్రాక్‌కే పెద్ద పీట వేశారని తెలుస్తోంది. సీరియస్ బోర్డర్ సీక్వెన్సెస్ తర్వాత మహేష్ కాశ్మీర్ నుంచి ఇంటికి వచ్చే ఎపిసోడ్ ఆసక్తికరంగా ప్లాన్ చేశారట. ఇందుకోసం ట్రైన్‌లో మహేష్, ఇతర నటీనటులతో హిలేరియస్ కామెడీ పండించాలని డిసైడ్ అయిన అనిల్ రావిపూడి స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట.

ఆమెది కీలక పాత్ర

ఆమెది కీలక పాత్ర

ఈ సినిమాలో విజయశాంతి ప్రొఫెసర్‌గా కనిపించబోతున్నారట. అది కూడా పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని తెలిసింది. ఇందులో ఆమె పాఠాలు చెప్పడంతో పాటు ఎంతో మందిని చైతన్యపరిచే డైలాగ్స్ చెబుతుందని టాక్. గతంలో కూడా విజయశాంతి ఈ తరహా పాత్రలు చేశారు. అప్పుడు ఆమెకు అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఈ లేడీ అమితాబ్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

తమన్నా ఎంటర్

తమన్నా ఎంటర్

సరిలేరు నీకెవ్వరులో రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, ఈ ప్రాజెక్టులోకి తమన్నా కూడా ఎంటర్ అవుతుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అయితే, ఆమె చేసేది ఓ స్పెషల్ సాంగ్‌కు మాత్రమేనని ప్రచారం జరుగుతోంది. ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే బాణీలు సిద్ధం చేస్తున్నాడట. ఇందులో ఆమె డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయని అంటున్నారు.

ఎన్టీఆర్‌తో ఊపేసింది

ఎన్టీఆర్‌తో ఊపేసింది

తమన్నా టాలీవుడ్‌లోని హీరోయిన్లలో బెస్ట్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె గతంలోనూ ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ'లో స్వింగ్ జరా అంటూ సాగే పాటలో ఆమె తన అద్భుతమైన డ్యాన్స్‌తో ఊపేసింది. అలాగే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శ్రీను', ‘స్పీడున్నోడు', సినిమాల్లోనూ చిందులేసింది.

సరిలేరు నీకెవ్వరు గురించి

సరిలేరు నీకెవ్వరు గురించి

సూపర్ స్టార్ మహేశ్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X