twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tamannaah's 11th Hour Teaser: చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు

    |

    దాదాపు పదేళ్లకు పైగానే తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. టీనేజ్‌లోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి సమయంలో ఈ అమ్మడు 'లెవెంత్ అవర్' అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ వరల్డ్‌లోకి ప్రవేశిస్తోంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్ విడుదల అయింది.

    ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తమన్నా లీడ్ రోల్ చేసిన వెబ్ సిరీస్‌ 'లెవెంత్ అవర్'. ప్రదీప్ ఉప్పలపాటి దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో మిల్కీ బ్యూటీ మరింత బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగేందుకు కృషి చేసే ఓ అమ్మాయి కథతో ఇది రూపొందినట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతోంది. ఇక, ఆమెకు అడుగడుగునా అడ్డంకులు కల్పించే గ్యాంగ్‌ను కూడా ఇందులో చూపించారు. ఇక, ఇందులో 'చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు.. క్రియేట్ చేసుకోవాలి' అనే డైలాగ్ బాగుంది.

    Tamannaahs 11th Hour Teaser Released

    సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో తమన్నాతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్, అరుణ్ అదిత్, వంశీ కృష్ణ, రోహిణి, శత్రు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇది ఏప్రిల్ 9న తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మిల్కీ బ్యూటీ చేస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా, తమన్నా భాటియా ప్రస్తుతం గోపీ చంద్ హీరోగా వస్తున్న 'సిటీమార్'తో పాటు సత్యదేవ్ నటిస్తున్న 'శీతాకాలం'లోనూ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ఆమె నటించిన 'దటీజ్ మహాలక్ష్మీ' షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

    English summary
    The digital debut of a big-screen star is always a special affair. It increases the value of the digital portal. After all, a big star, making their debut in a digital web series or film helps them in building trust with the audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X