యువ హీరోకు బంపర్ ఆఫర్.. మిల్కీ బ్యూటీతో రొమాన్స్‌కు రెడీ
ప్రస్తుతం తెలుగు నాట రీమేక్‌లో జోరు ఎక్కువగా ఉంది. మళయాల చిత్ర సీమలో రూపొందుతున్న క్లాసిక్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే డ్రైవింగ్ లైసెన్స్, అయ్యప్పనుమ్ కోషియమ్, కపేలా వంటి చిత్రాలపై కర్చీప్ వేశారు. తాజాగా కన్నడలో రూపొందిన ఓ లవ్ స్టోరీనీ తెలుగులో పరిచయం చేసేందుకు సిద్దమయ్యారు.
కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన లవ్ మాక్‌టెయిల్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్దమైంది. ఈ రీమేక్ కోసం ప్రతిభావంతుడైన యువ నటుడిని ఎంపిక చేశారు. జ్యోతిలక్ష్మీ ఫేమ్ సత్యదేవ్‌ను హీరోగా కన్ఫామ్ చేశారు. అయితే హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను ఫిక్స్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. తాజాగా ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

ప్రేమ ఉన్న చోటే జీవితం ఉంటుందని చెప్పే చిత్రంగా లవ్ మాక్‌టెయిల్ అందరినీ మెప్పించింది. ఆ సినిమాను తమన్నా, సత్యదేవ్‌లతో తెలుగులో నాగశేఖర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు కీరవాణి తనయుడ కాళ భైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు. సత్యా హెగ్డే కెమెరామెన్‌గా పనిచేస్తున్నాడు. భావన రవి, నాగ శైఖర్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. 47 డేస్ చిత్రంతో ఇటీవలె పలకరించిన సత్యదేవ్.. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య అనే మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











