సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న మరో స్టార్ కపుల్.. నెట్టింట ఫొటోలు వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

2023 చివరి నుంచి ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటూ ఓ ఇంటి వాళ్లు అయిపోతున్నారు. పలువురు ముందుగానే చెప్పి తమకు నచ్చిన వాళ్లను వివాహం చేసుకుంటుండగా.. మరికొందరు మాత్రం సీక్రెట్ గానే ఒక్కటవుతున్నారు. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్, కృతి కర్బందాలు, తాప్సీ పన్ను వంటి వాళ్లంతా తమకు నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారు.

ఇటీవలే హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితీ రావు హైదరి కూడా నిశ్చితార్థం చేసేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు చెప్పేశారు. తాజాగా మరో స్టార్ కపుల్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Tamil Actor Darshan And Anju Kurian Secret Marriage Photos Goes Viral on Internet

తమిళ నటుడు దర్శన్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో వచ్చి కనా సినిమాలో కనిపించి అందిరినీ మెప్పించిన ఈయనకు.. ప్రస్తుతం 32 ఏళ్ల వయసు. 2015లో రజినీమురుగన్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టినా.. రెండో సినిమా కనాతోనే గుర్తింపు వ్చచింది. ఇక ఆ తర్వాత తుంబ, తునివు వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించాడు. ఓవైపు షార్ట్ ఫిల్మ్స్ మరోవైపు టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంటాడు. అయితే తాజాగా ఈయన పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ హీరోయిన్ అంజు కురియన్ నుసీక్రెట్ గా వివాహం ఆడగా.. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

2013లో నరం సినిమాతో తమిళ, మలయాళ సినీ రంగాల్లో అడుగు పెట్టిన హీరోయిన్ అంజు కురియన్ ఆ తర్వాత కూడా అదిరిపోయే సినిమాలు చేసింది. తెలుగులో ఇజం జగత్ సినిమాలో మహతిగా కనిపించింది ఈ అమ్మాయే. ముఖ్యంగా ఇగ్లూ సినిమాతో అంజు కురియన్ కు విపరీతమైన గుర్తింపు వ్చచింది. ఇటీవలే అబ్రహం ఓజ్లర్ సినిమాలో కూడా నటించి మెప్పించిన ఈమె చడీ చప్పుడు లేకుండా దర్శన్ ను పెళ్లి చేసుకోవడంతో అంతా షాక్ అవుతున్నారు.

ముఖ్యంగా వీరిద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుపు రంగు బటట్ల్లో దర్శన్.. క్రీమ్ అండ్ రెడ్ కలర్ చీరలో అంజు కురియన్ లు అదిరిపోగా.. బంధువులు, స్నేహితుల మధయ వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది.. వంటి విషయాలు ఏవీ తెలియకపోయినా వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓసారి వీరి పెళ్లి ఫొటోలు చూసేయండి. కొత్త జంటను ఆశీర్వరదించేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X