మొన్న తండ్రి .. నేడు కొడుకు.. డ్రగ్స్ కేసులో నటుడి కొడుకు అరెస్ట్..
సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ వివాదంలో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా ఆ మహమ్మారినీ విడిచిపెట్టడం లేదు. తరచూ ఎవరో ఒకరు డ్రగ్స్ వివాదంలో ఇరుక్కుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కోలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడి కుమారుడు డ్రగ్స్ దందాలో ఇరుక్కుపోయినట్లు సమాచారం. ఇంతకీ ఆ నట వారసుడు ఎవరో ఓ లూక్కేయండి.
తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న మన్సూర్ అలీ ఖాన్ మొన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆ వివాదం సమాసిపోకముందే ఆయన వారసుడు అలీఖాన్ తుగ్లక్ పోలీసులకు పట్టుబడ్డాడు. గత నెలలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వాళ్లను విచారించగా.. మన్సూర్ అలీ ఖాన్ కొడుకు తుగ్లక్ అలీ ఖాన్ పేరు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇలా తీగలాలితే డొంక కదిలినట్టు.. డ్రగ్స్ వివరాలు మొత్తం బయటికి వచ్చాయి. గత నెలలో చెన్నైలోని ఓ ప్రైవేట్ కళాశాలలో సెల్ ఫోన్ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ విద్యార్థులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ఇకపోతే ఈ కేసులో 10 మంది విద్యార్థులను గత మూడు రోజుల క్రిందమే అరెస్టు చేయగా వెరైటీ రిమాండ్కు తరలించారు.
అసలు విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నుండి గంజాయిని కొనుగోలు చేసి చెన్నైలోని కొట్టంగోలతుర్రు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులకు డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం పోలీసుల దర్యాప్తులో గంజాయి కొనుగోలు చేసిన వ్యక్తులు ఎవరు అమ్ముతున్న వ్యక్తులు ఎవరో అనే విషయాలను తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇందులో తమిళ సినీ నటుడు మన్సూర్ అలీ ఖాన్ కుమారుడు అలీఖాన్ తుగ్లక్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

దీంతో అతనిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బ్రుందాలుగా ఏర్పడి ఎట్టకేలకు పట్టుకున్నారు. మన్సూర్ కొడుకు తుగ్లకు దాదాపు 12 గంటల పాటు విచారించి, మరో ఏడుగురి పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మీరందరిని జూడిషియల్ కస్టడీకి తరలించినట్టు తెలుస్తుంది. ఈ తెలుసుకున్న సినీ ప్రముఖులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు చాలామంది డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడగా.. ఇక్కడ ఆయన మాత్రం పట్టుబడడం సరికొత్త అనుమానాలకు దారితీస్తుంది.
త్రిషపై మన్సూల్ అలీ ఖాన్ కామెంట్స్ .. ఈ ఏడాది ప్రారంభంలో మన్సూర్ అలీ ఖాన్.. నటి త్రిషపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా అలీ ఖాన్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు, సినిమాలో బెడ్‌రూమ్ సన్నివేశం ఉంటుందని నేను అనుకున్నాను. నేను ఆమెను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళతానని అనుకున్నాను. ఎందుకంటే నేను నా మునుపటి చిత్రాలలో చాలా రేప్ సన్నివేశాలు చేసాను. ఇది నాకు కొత్త కాదు అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











