వరుణ్ తేజ్ మూవీలో కీలక పాత్రలో కట్టప్ప!
బాహుబలిలో కట్టప్ప పాత్రతో సూపర్ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ ఇటీవల విడుదలైన 'జెర్సీ'లో క్రికెట్ కోచ్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ స్టార్ మరో తెలుగు సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీ స్టార్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందబోయే చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో హీరోకు అత్యంత సన్నిహితంగా ఉండే పాత్రలో ఆయన కనిపించబోతున్నారట. అయితే ఏ పాత్ర అనే విషయం బయటకు రాలేదు.

కిరణ్ కొర్రపాటి ఇంతకు శ్రీను వైట్ల వద్ద పని చేశారు. వరుణ్ తేజ్ హీరోగా త్వరలో సినిమా చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒలంపిక్ మెడల్ సాధించే లక్ష్యంతో వరుణ్ కనిపిస్తాడని టాక్.
జెర్సీ మూవీలో సత్యరాజ్ కోచ్ పాత్రలో కనిపించాడు కాబట్టి... వరుణ్ తేజ్ మూవీలో కూడా బాక్సింగ్ కోచ్‌గా కనిపిస్తారా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అంశాలపై క్లారిటీ రానుంది.
'మిర్చి' మూవీలో తండ్రి పాత్రలో హైలెట్ అయిన తర్వాత సత్యరాజ్ తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. బాహుబలి, బాహుబలి 2, నేను శైలజ, జెర్సీ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకున్నాయి. అతడి పెర్ఫార్మెన్స్‌లో ఒక యునిక్ స్టైల్ ఉండటం తెలుగు ఫిల్మ్ మేకర్స్‌ను ఆకర్షిస్తుంది.


Click it and Unblock the Notifications











