twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండెపోటుతో కుప్పకూలిపోయిన కమెడియన్ వివేక్.. విషమంగా మారిన పరిస్థితి..

    |

    తమిళ సీనియర్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వివేక్ సడన్ గా ఆస్పత్రిపాలవ్వడం అభిమానులను షాక్ కు గురి చేసింది. అకస్మాత్తుగా గుండెల్లో నొప్పి రావడంతో కుప్పకూలిపోగా వివేక్‌ను ఏప్రిల్ 16, శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతూ నటుడి పరిస్థితి విషమంగా ఉందని వడపాలనిలోని సిమ్స్ ఆసుపత్రి వైద్యులు మీడియాకు తెలిపారు.

    ఐసీయూలో చికిత్స

    ఐసీయూలో చికిత్స

    వివేక్‌ను ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. అతను ఐసీయూలో ఉన్నట్లు తెలుస్తోంది. 59 ఏళ్ల ఈ నటుడు గురువారం రోజు COVID-19 వ్యాక్సిన్ కూడా వేయించుకున్నాడు. టీకాలు వేసిన వెంటనే, నటుడు మీడియాతో కూడా మాట్లాడాడు. అలాగే కోవిడ్ ను ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచనలు ఇచ్చారు.

    ఆ సినిమాల ద్వారా..

    ఆ సినిమాల ద్వారా..

    వివేక్ కేవలం తమిళ జనాలకే కాకుండా తెలుగు వారికి కూడా సూపరిచితమే శంకర్ దర్శకత్వంలో చేసిన కొన్ని సూపర్ హిట్ సినిమాలు తెలుగులో సక్సెస్ కావడం వలన వివేక్ ఇక్కడి వారికి కూడా బాగా దగ్గరయ్యాడు. బాయ్స్, అపరిచితుడు, శివాజీ సినిమాల ద్వారా వివేక్ అన్ని వర్గాల ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాడు.

    సినిమాలకు దూరంగా

    సినిమాలకు దూరంగా

    ధనుష్ నటించిన రఘువరన్ బి.టెక్ సినిమా కూడా తెలుగులో హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో అతని కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

    అయితే తమిళ ఇండస్ట్రీలో వివేక్ గతంలో మాదిరిగా ఆఫర్స్ అందుకోవడం లేదు. అనారోగ్య కారణాల వల్ల చాలా వరకు సినిమాలు తగ్గించేశారు.

    Recommended Video

    Actor Vivek Biography, తన ధ్యేయం ఇదే , రూమర్స్ నమ్మొద్దు | RIP Vivek Sir | Filmibeat Telugu
    ఉలిక్కిపడిన కోలీవుడ్

    ఉలిక్కిపడిన కోలీవుడ్

    ఇక ఈ నటుడు సడన్ గా గుండెపోటుతో హాస్పిటల్ లో చేరడంతో ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది. వెంటనే ఆయన కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ఇక వివేక్ గురువారం వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం ఎంతో ఉల్లాసంగా మాట్లాడుతూ మరుసటి రోజే హార్ట్ ఎటాక్ కు గురి కావడం హాట్ టాపిక్ గా మారింది.

    English summary
    Hospitalization came as a shock to Vivek Sudden, who has earned a special recognition for himself as a Tamil senior comedian. Vivek was admitted to a private hospital on Friday, April 16 after collapsing due to sudden heartburn.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X